Egg Salad Recipe: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ ఎగ్ సలాడ్
Egg Salad Recipe: బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట ఉపవాసం చేస్తారు. అలా కాకుండా ఈ ఎగ్స్ సలాడ్ రెసిపీని ప్రయత్నించండి.
Egg Salad Recipe: కోడిగుడ్లు అధికంగా తింటే బరువు పెరుగుతారు, కానీ మితంగా తినడం వల్ల బరువు పెరగరు. కాబట్టి అధిక బరువును తగ్గించుకునేందుకు రాత్రిపూట తినడం అలవాటు చేసుకోండి. రాత్రి సమయంలో తక్కువగా తినాలనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అన్నం, కూర, పెరుగు ఇలా తినకుండా కేవలం పండ్లు, పాలు తాగి ముగించేవారు. ఎంతోమంది ఇలా చేయడం వల్ల వారి శరీరం బలహీన పడుతుంది. కాబట్టి అన్ని పోషకాలను అందించే ఎగ్ సలాడ్ తినేందుకు ప్రయత్నించండి. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతోపాటు బరువును అదుపులో ఉంచుతుంది. దీన్ని కేవలం ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
ఎగ్ సలాడ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - రెండు
క్యారెట్ తురుము - రెండు స్పూన్లు
టమాటా (చిన్నది) - ఒకటి
చాట్ మసాలా - పావు స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఎగ్ సలాడ్ రెసిపీ
1. కోడిగుడ్డును ఉడికించుకొని సన్నగా కట్ చేసుకుని. ఒక గిన్నెలో వేయాలి.
2. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి. కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
3. టమాటోలను గింజలు తీసేసి సన్నగా తరగాలి. క్యారెట్స్ సన్నగా తురుముకోవాలి.
4. ఈ రెండింటిని కోడిగుడ్ల మిశ్రమంలో వేయాలి.
5. పైన మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
6. అంతే టేస్టీ ఎగ్ సలాడ్ రెడీ అయినట్టే.
7. ఒక కోడి గుడ్డు సరిపోని వారు రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసుకోవచ్చు.
8. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోదు.