E-Commerce Diwali Sale 2022 : అదిరే ఆఫర్లతో వచ్చేసిన Amazon, Flipkart, Myntra, AJio & Nykaa..-ecommerce diwali sale 2022 start in amazon flipkart myntra ajio and nykaa here is the discounts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  E-commerce Diwali Sale 2022 Start In Amazon, Flipkart, Myntra, Ajio And Nykaa Here Is The Discounts

E-Commerce Diwali Sale 2022 : అదిరే ఆఫర్లతో వచ్చేసిన Amazon, Flipkart, Myntra, AJio & Nykaa..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 11, 2022 07:21 AM IST

E-Commerce Diwali Sale 2022 : పండుగలు అలా వస్తుంటే.. ఆఫర్లతో ఇ-కామర్స్ ఇలా సిద్ధమైపోతాయి. రానున్న దీపావళి కోసం.. ఇప్పటికే పలు ఇ-కామర్స్ ఆఫర్స్ ప్రకటించాయి. ఉత్తమ డీల్స్, డిస్కౌంట్లు, ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. మరి ఇంతకీ ఈ సేల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి.. వేటిపై డిస్కౌంట్లు దొరుకుతాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

E-Commerce Diwali Sale 2022
E-Commerce Diwali Sale 2022

E-Commerce Diwali Sale 2022 : పండుగ సమయంలో షాపింగ్ చేసే వారు చాలా మంది ఉంటారు. దుస్తుల నుంచి.. నచ్చే గాడ్జెట్స్ వరకు అదిరే డిస్కౌంట్లతో మంచి డీల్స్ చేయాలనుకుంటారు. వారిని ఆకర్షించేందుకు ఇ-కామర్స్ కూడా సేల్స్ ప్రారంభిస్తాయి. ఒకరికి మించి మరొకరు అదిరే డిస్కౌంట్లు, డీల్స్, ఆఫర్లతో ఆకట్టకుంటారు. తాజాగా దీపావళి సేల్ లో భాగంగా.. Amazon, Flipkart, Myntra, Ajio, Nykaa.. తమ సేల్స్, డీల్స్ ప్రకటించాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Amazon

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నెల రోజుల పండుగ వేడుకల్లో భాగంగా అమెజాన్ 'Extra Happiness Days' ఆఫర్‌లను ప్రకటించింది. ఆఫర్‌లు అక్టోబర్ 8 అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. కస్టమర్‌లు గొప్ప తగ్గింపులతో "కేటగిరీలలో తాజా ఉత్పత్తులను" కొనుగోలు చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

'Extra Happiness Days'లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హెల్త్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, బేబీ ప్రోడెక్ట్స్, మరిన్నింటిపై విక్రేతల నుంచి ప్రత్యేక డీల్‌లు, ఆఫర్‌లను అందజేస్తుంది. Tecno, iQOO, Xiaomi నుంచి స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన ఆఫర్లలో పొందవచ్చు.

Flipkart

Flipkart Plus వినియోగదారుల కోసం అక్టోబర్ 10 అర్ధరాత్రి నుంచి సేల్‌ను ప్రారంభించింది. ప్లస్ కాని వినియోగదారుల కోసం.. సేల్ అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. షాపింగ్ చేసేవారు SBI కార్డ్‌లను ఉపయోగించి 10 శాతం తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ ఉపయోగించి 5 శాతం తగ్గింపు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్, Paytm, UPI లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ దొరుకుతుంది.

ఇది ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో మానిటర్లు, ప్రింటర్లు, కెమెరాలు, సంబంధిత ఉపకరణాలపై 70 శాతం వరకు తగ్గింపు, కంప్యూటర్, సంబంధిత ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉంది.

Myntra

Myntra విక్రయం కూడా లైవ్‌లో ఉంది. ప్రస్తుతం దుస్తులు, ఉపకరణాలు, అందం, గాడ్జెట్‌లు వంటి వర్గాలలో 50 నుంచి 80 శాతం తగ్గింపుతో సేల్ నడుస్తుంది. గృహోపకరణాలపై 40 నుంచి 70 శాతం తగ్గింపు పొందవచ్చు. అయితే బడ్జెట్ స్టోర్‌లలో రూ. 499 స్టోర్, రూ. 999 లోపు యాక్టివ్‌వేర్, ఫ్లాట్ 70 శాతం తగ్గింపుతో కిడ్స్ వేర్‌లు మిమ్మల్ని ఎక్కువ ఆకట్టుకుంటాయి.

Ajio

Ajio కూడా అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. ఫ్యాషన్, హోమ్ కేటగిరీలు రెండింటిలోనూ గొప్ప తగ్గింపులను అందిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో మీ వార్డ్‌రోబ్, ఇంటిని అప్‌గ్రేడ్ చేయడానికి స్టైలిష్ వెస్ట్రన్, ఇండియన్ వేర్, యాక్సెసరీస్, ప్రీమియం బ్రాండ్‌లపై 50 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్‌లు పొందవచ్చు.

Nykaa

ఫ్యాషన్ బ్రాండ్ Nykaa దీపావళి ధమాకా సేల్ ఇప్పుడు వివిధ సౌందర్య ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపుతో వచ్చేసింది. డిస్కౌంట్‌లతో పాటు, చెక్అవుట్ సమయంలో ఉపయోగించగల ఫ్లాట్ రూ. 400 తగ్గింపు, ఫ్లాట్ రూ. 200 తగ్గింపు వంటి అనేక కూపన్‌లను కూడా మీరు పొందవచ్చు. డే డీల్‌లు, షాపింగ్ చేయడానికి ప్రత్యేకమైన దీపావళి స్టోర్‌తో.. మీరు హ్యాపీగా షాపింగ్ చేసేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం