Dry Amla For White Hair : తెల్ల జుట్టు నల్లగా మారేందుకు ఎండిన ఉసిరి.. ప్రాసెస్ చాలా ఈజీ-dry amla to white hair turns into black all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dry Amla For White Hair : తెల్ల జుట్టు నల్లగా మారేందుకు ఎండిన ఉసిరి.. ప్రాసెస్ చాలా ఈజీ

Dry Amla For White Hair : తెల్ల జుట్టు నల్లగా మారేందుకు ఎండిన ఉసిరి.. ప్రాసెస్ చాలా ఈజీ

Anand Sai HT Telugu
Nov 17, 2023 03:45 PM IST

Dry Amla For White Hair : ఉసిరితో జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎండిన ఉసిరిని తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగించొచ్చు. అదేలాగో తెలుసుకుందాం..

తెల్లజుట్టుకు ఉసిరి
తెల్లజుట్టుకు ఉసిరి

జుట్టు సమస్యలతో(Hair Problems) అందరూ బాధపడుతున్నారు. చిన్నాపెద్ద కూడా జుట్టు తెల్లబడటం(White Hair) ఇబ్బంది పెడుతుంది. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇవి తాత్కాలికంగా ఫలితం ఉన్నట్టే అనిపించినా తీవ్ర సమస్యలను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మరికొన్ని సార్లు జుట్టు ఊడిపోవచ్చు. అందుకే ఇంట్లోనే హెయిర్ ప్యాక్ తయారుచేసుకుంటే బాగుంటుంది.

ఆహారపు అలవాట్లు, జీవన విధానం, కాలుష్యం, ఒత్తిడి కారణంగా జుట్టు సమస్యలు వస్తాయి. అందుకే పిల్లల్లోనూ తెల్ల జుట్టు సమస్యలు కనిపిస్తాయి. చిన్న వయసులో తెల్ల జుట్టు వస్తే మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికోసం రసాయనాలు వాడకుండా.. ఉసిరితో మీ సమస్యను తగ్గించుకోవచ్చు. సులభంగా లభించే చిట్కాతో తెల్ల జుట్టును నల్లగా(White Hair To Black) మార్చుకుని హ్యాపీగా ఉండొచ్చు. అందుకోసం ఏం చేయాలంటే..

ముందుగా కొన్ని ఉసిరికాయలను ఎండబెట్టాలి. కొన్ని రోజుల తర్వాత అవి పూర్తిగా డ్రై అవుతాయి. తర్వాత దానిని పొడిగా చేసుకోవాలి. మార్కెట్లో దొరికే ఉసిరిపొడిలో రసాయనాలు కలిపే అవకాశం ఉంది. మీరే ఇంట్లో తయారు చేసుకుంటే మంచిది. తర్వాత 10 మందార ఆకులను, గుప్పెడు గోరింటాకును, గుడ్డు తెల్లసొన, రెండు స్పూన్ల ఉసిరి పొడి, 3 టీ స్పూన్ల కలబంద జెల్, 3 టీ స్పూన్ల పెరుగు, కాస్త నిమ్మరసం తీసుకోవాలి. ఈ పదార్థాలు అన్నీ జార్‍లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్ జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు చివరి వరకూ బాగా పట్టించుకోవాలి. ఒక గంటసేపు అలానే ఉంచుకోండి. తర్వాత కుంకుడుకాయతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా అవుతుంది. నెలలో మూడు నాలుగు సార్లు ఈ చిట్కాను ట్రై చేయండి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

అంతేకాదు నీటిలో ఉసిరికాయ పొడిని వేసి 5 నిమిషాలు వేడి చేయండి. ఇది చల్లారిన తర్వాత.. నిమ్మరసం(Lemon) వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత తలకు పట్టించాలి. ఆరిన తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్యల నుంచి బయటపడొచ్చు. జుట్టు రాలడం(Hair Loss) కూడా తగ్గుతుంది. జుట్టు సరిగా ఉండాలంటే పోషకాలు ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలి.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

Whats_app_banner