తెలుగు న్యూస్ / ఫోటో /
Food for grey hair: తెల్లజుట్టు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..
Food for grey hair: వయసు పైబడక ముందు జుట్టు తెల్లబడటం చాలా మందిలో కనిపించే సమస్యలు. దానికోసం ఎలాంటి పోషకాలున్న ఆహారం తినాలో తెలుసుకోండి.
(1 / 6)
చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య చాలా మందిని వేదిస్తోంది. ఒత్తిడి, జీవనవిధానాలే దీనికి ముఖ్య కారణాలు. ఆహారం, పోషణ ఈ సమస్య తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇన్ట్సంట్ మీల్స్, ఫాస్ట్‌ఫుడ్ వల్ల తినే ఆహారంలో పోషకాలుండట్లేదు. ఈ సమస్య తగ్గాలంటే తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకోండి. (Freepik)
(2 / 6)
పాలకూర, శనగలు, నారింజ: ఫోలిక్ యాసిడ్ జుట్టుకు కావాల్సిన సరైన పోషణ ఇస్తుంది. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, పాలకూర, మెంతికూర, శనగలు, ధాన్యాలు, బీన్స్, బటానీ, నారింజ లాంటి పండ్లలో, నిమ్మజాతి పండ్లలో, గింజలు, బాదాం, వేరుశనగ, సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. (Unsplash)
(3 / 6)
పాలు, గుడ్లు: విటమిన్ బి12 ఎక్కువగా ఉండే గుడ్డు సొన, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. జుట్టు తెల్లబడే సమస్యను తగ్గిస్తాయి. (Unsplash)
(4 / 6)
జింక్: గుమ్మడి, సన్ ఫ్లవర్, పుచ్చకాయ విత్తనాల్లో, పిస్తా, బాదాం లాంటి డ్రై ఫ్రూట్స్‌లో, నల్ల శనగలు, నల్ల నువ్వుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టు తెల్లబడే సమస్య అదుపులో ఉంచుతాయి. (Pixabay)
(5 / 6)
కాపర్: నువ్వులు, జీడిపప్పు, బాదాం, ఎర్రటి మాంసం, గోదుమలు, ధాన్యాలు కూడా తెల్లజుట్టు రాకుండా సాయపడతాయి. (Pixabay)
ఇతర గ్యాలరీలు