Curry Leaves Water Benefits : రోజూ కరివేపాకు నీటిని తాగితే చాలా మంచిది.. ఇక మెుదలెట్టండి-drinking curry leaves water daily benefits all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curry Leaves Water Benefits : రోజూ కరివేపాకు నీటిని తాగితే చాలా మంచిది.. ఇక మెుదలెట్టండి

Curry Leaves Water Benefits : రోజూ కరివేపాకు నీటిని తాగితే చాలా మంచిది.. ఇక మెుదలెట్టండి

Anand Sai HT Telugu
Oct 29, 2023 11:00 AM IST

Curry Leaves Water Benefits : కరివేపాకుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు.. రోజూ కరివేపాకును నీటిలో నానబెట్టి, ఆ నీరు తాగితే శరీరానికి అద్భుతాలు జరుగుతాయి.

కరివేపాకు
కరివేపాకు (unsplash)

దక్షిణాది వంటకాల్లో కరివేపాకను ఎక్కువగా ఉపయోగిస్తారు. కర్రీ రుచిని రెండు రెట్లు పెంచుతుంది ఇది. అయితే వంట రుచిని పెంచడమే కాకుండా, కరివేపాకుతో ఇతర ప్రయోజనాలు(Curry Leaves Benefits) కూడా ఉన్నాయి. వివిధ ఆరోగ్య సమస్యలకు కరివేపాకు బాగా పని చేస్తుంది. కరివేపాకు నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చాలా వ్యాధులు నయమవుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు నానబెట్టిన నీటిని వంటలో ఉపయోగించడంతో పాటు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏంటో చూద్దాం..

కొలెస్ట్రాల్(Cholesterol) సమస్య ఇప్పుడు ఎక్కువైపోయింది. చాలా సార్లు మందులు వాడినా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం సాధ్యం కాదు. ఈ సందర్భంలో కరివేపాకుపై ఆధారపడవచ్చు. కరివేపాకు నానబెట్టిన నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకులో నానబెట్టిన నీటిని తాగడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చూపు మెరుగుపడుతుంది. వివిధ కంటి సమస్యలను నివారిస్తుంది.

కరివేపాకు జుట్టు(Curry Leaves For Hairs)కు చాలా మేలు చేస్తుందని అందరికీ తెలుసు. జుట్టు రాలడం సమస్యను తక్షణమే తగ్గిస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. మీ రోజూ కరివేపాకు నానబెట్టిన నీటిని తీసుకోండి. ఇది జుట్టు రాలడం(Hair Loss) సమస్యను తగ్గిస్తుంది. జుట్టు మందంగా, నల్లగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన కాలేయం చాలా ముఖ్యం. కానీ బయట ఆహారం ఎక్కువగా తినడం, జీవనశైలి మార్పులు, అనేక ఇతర కారణాల వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాలేయం మంచి స్థితిలో ఉండాలంటే కరివేపాకును కలపాలి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు లివర్ డ్యామేజ్‌ని నివారిస్తాయి. ఇది కాకుండా కరివేపాకు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కరివేపాకు మన రోగనిరోధక శక్తి(Immunity)ని బలపరుస్తుంది. ఫలితంగా, శరీరం వివిధ వ్యాధుల నుండి రక్షించబడుతుంది. కరివేపాకు నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

కరివేపాకు వాసన మన శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కండరాలు, నరాలకు విశ్రాంతినిస్తుంది. కరివేపాకు కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. ఒక గ్లాసు కరివేపాకు నీరు(Curry Leaves Water) లేదా ఒక కప్పు కరివేపాకు టీ తాగడం వల్ల తక్షణమే రిఫ్రెష్ అనిపిస్తుంది.

WhatsApp channel