కూర చేసేప్పుడు 5-6 కరివేపాకు ఆకులు వేస్తే సువాసనతోపాటు రుచి కూడా పెరుగుతుంది. అయితే ఇది వంట రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే కరివేపాకును వాడతాం. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజూ ఖాళీ కడుపుతో కరివేపాకులను తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కరివేపాకు రక్తపోటును అదుపులో ఉంచడంలో చాలా మేలు చేస్తుంది. కరివేపాకులో పొటాషియం ఉంటుంది, ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రోజూ కొంత కరివేపాకును తినండి.
మన జీవనశైలి వల్ల ఒబేసిటీ సమస్య పెరుగుతోంది. ఊబకాయాన్ని నియంత్రించడంలో కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. ఉదయం వ్యాయామం ప్రారంభించే ముందు, కొద్దిగా కరివేపాకును నమిలి, దాని రసాన్ని మింగండి. ఆపై అరగంట పాటు వ్యాయామం చేయండి. కొద్ది రోజుల్లోనే మీ శరీర బరువులో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది.
మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. మధుమేహం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
కొందరిలో మంట ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. కరివేపాకు మొత్తం ఆరోగ్యానికి మంచిది.
జుట్టు రాలడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే తలకు పట్టించే నూనెకు కరివేపాకును కూడా కొందరు వాడుతుంటారు.
3-4 ఆకులు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అతిగా తినకూడదు. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అలెర్జీ రావచ్చు.