Breastfeeding : పిల్లలకు పాలు ఇచ్చేప్పుడు ఫోన్ చూస్తున్నారా? చాలా డేంజర్
Breastfeeding : ఈ కాలంలో ఫోన్ వాడకం ఎక్కువైపోయింది. బిడ్డకు పాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో ఫోన్ చూడటం చాలా ప్రమాదకరం.
శిశువు సరైన ఎదుగుదలకు, అవసరమైన పోషకాహారాలు తల్లి పాల నుంచే అందుతాయి. మీ బిడ్డకు పోషకాహారం అందించడం వల్ల మీ పిల్లలకి మంచి బాంధవ్యాన్ని అందించడానికి సహాయపడుతుంది. పిల్లలు పాలు తాగే సమయంలో తల్లి ఫోన్ ఉపయోగించకూడదు.
మొబైల్ ఫోన్(Mobile Phone) మన జీవితంలో ముఖ్యమైనదిగా అయిపోయింది. ఫోన్ లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. కానీ ఒక తల్లి బిడ్డకు చనుబాలిస్తూ.. మొబైల్ చూడకూడదు. బిడ్డ పాలు తాగే జీవితంలో ముఖ్యమైన అనుభవాలను కోల్పోవచ్చు.
మొదటి 6 నెలలలో తల్లి, పిల్లల మధ్య కంటి చూపు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మొబైల్ వాడటం వలన మీ కంటిని మీ బిడ్డ చూడదు. మీరు ఫోన్ లోనే ఉంటారు. మీ బిడ్డ మీ ముఖం వైపు చూసినా.. పట్టించుకోరు. తల్లి, పిల్లల కంటి సంబంధం వారి భావోద్వేగాలు, మెదడులను జతచేస్తుంది అని పరిశోధనలు తెలియజేస్తాయి. ఇదే భవిష్యత్తులో పిల్లల శిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మీ ఫోన్‌లో మీరు ఉంటే.. మీ బిడ్డ మీ దృష్టిలో మార్పును గమనించవచ్చు. దీని వలన బిడ్డ పాలు తాగడం ఆలస్యం చేయడం ప్రారంభించవచ్చు. మీ దృష్టిని బిడ్డ తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నించవచ్చు. మీ దృష్టి కేవలం పిల్లల మీద ఉండేలా చూసుకోండి.
ఫోన్‌లు రేడియేషన్ విడుదల చేస్తాయి. ఇది మీ పిల్లల డీఎన్ఎ(DNA) నిర్మాణం, కణాలను హాని చేస్తుంది. అలాగే క్యాన్సర్ (Cancer), ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కలిగించవచ్చు. ఈ విధంగా పిల్లలు పాలు తాగే సమయంలో పిల్లలతో మీరు గడిపే సమయాలలో పిల్లలనుండి మొబైల్‌ను దూరంగా పెట్టండి.
మీరు ఫోన్ చూస్తూ ఉంటే అందులోనే ఉంటారు. మీ బిడ్డగు ఎంత పాలు ఇవ్వాలనే విషయాన్ని మరిచిపోతారు. కొన్నిసార్లు పిల్లలు ఎక్కువ పాలు తాగొచ్చు. కొన్నిసార్లు తక్కువ పాలు తాగొచ్చు. మీ దృష్టిని మీ బిడ్డ మీద పెడితే.. ఎంత మోతాదులో బిడ్డ పాలను తీసుకుంటే కడుపు నిండుతుందో మీకు తెలుస్తుంది. మీ బిడ్డకు పాలు పట్టించేటపుడు మొబైల్ వాడకాన్ని నివారించడం వలన మీ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.