Handbag DIY: మీ హ్యాండ్ బ్యాగు లేదా పర్సు పాతదైతే పడేయకండి, వాటిని ఇంటి అందాన్నిపెంచడానికి ఇలా వాడండి
Handbag DIY: పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్ చిరిగిపోవడం, పాతగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటిని పడేయకుండా ఇంటి అందాన్ని పెంచుకునేందుకు తిరిగి వాడవచ్చు. ఇక్కడ మేము కొన్ని ఐడియాలు ఇచ్చాము.
హ్యాండ్ బ్యాగ్ లేదా పర్సు పాతబడితే వెంటనే దాన్ని పడేస్తారు. లేదా ఎవరికైనా వాడుకోమని ఇచ్చేస్తారు. నిజానికి వాటిని పడేయాల్సిన అవసరం లేదు. వాటిని కొత్తగా మీ అవసరానికే ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల మీ డబ్బు ఆదా కావడమే కాకుండా పాత పర్సు మళ్లీ ఉపయోగించినట్టు అవుతుంది.
పాత పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్ పాడైతే దాని హ్యాండిల్స్ కట్ చేసేయండి. దాన్ని అవసరమైన కాగితాలు పెట్టుకునే స్టోరేజ్ లా వాడండి. డాక్యుమెంట్లు, ఫొటోకాపీలు, గుర్తింపు కార్డులులాంటివి దాచుకోవచ్చు. అవన్నీ ఒకేచోట ఉంచడానికి పాత హ్యాండ్ బ్యాగు వినియోగించుకోవచ్చు. ఈ వస్తువులన్నింటినీ మీరు సులభంగా పాత పర్సులో భద్రంగా ఉంచుకోవచ్చు.
కార్ టూల్ కిట్
కారులో అవసరమైన వస్తువులను ఉంచడానికి మీరు పాత పర్సును ఉపయోగించవచ్చు. ప్రత్యేక టూల్ కిట్ ఉంచడానికి మీరు బ్యాగ్ కొనాల్సిన అవసరం లేదు.
వేలాడే స్టోరేజ్
హ్యాండ్ బ్యాగ్ పాతబడితే, దాన్ని వంటగది లేదా హాల్లోని గోడలకు వేలాడదీయండి. ఇందులో మీరు రోజూ ఉపయోగించే కాగితాలు, ఇతర వస్తువులు ఏవైనా ఉంచుకోవచ్చు. ఉదాహరణకు డైరీ, పెన్నులు, బిల్లులు మొదలైనవి. వంటగదిలో అయితే స్పూన్లు పెట్టేందుకు వాడవచ్చు. అందానికి కూడా పాత హ్యాండ్ బ్యాంగ్ వాడవచ్చు. దీన్ని గోడకు తగిలించి అందులో కొన్ని ప్లాస్టిక్ పూలను పెట్టడం ద్వారా ఇంటి అందాన్ని పెంచవచ్చు.
పర్సు బయటి పొరపై ప్లాస్టిక్‌తో చేస్తారు. అది విరిగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. దీని వల్ల మనం పర్సు వాడటం మానేస్తాం. ఈ రకమైన పర్సును అలంకరించడం ద్వారా మీరు కొత్త పర్సును తయారు చేయవచ్చు. పైన గోటా, లేస్, నెట్, ప్రకాశవంతమైన వస్త్రాన్ని అతికించడం ద్వారా కొత్త పర్సుగా మార్చవచ్చు. అదేవిధంగా పర్సు లేదా హ్యాండ్ బ్యాగును పూసలు, మెరుపు తీగలతో అలంకరించి, పర్సును కొత్తగా మార్చుకోవచ్చు. మీరు ఖరీదైన పార్టీ వేర్ పర్సులను విడిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పాత పర్సులనే కొత్తగా మార్చుకోవచ్చు.
టాపిక్