Banana Problems : ఈ సమస్యలు ఉన్నవారు అరటిపండు తింటే ప్రమాదమే!-dont eat banana who people facing these health problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Problems : ఈ సమస్యలు ఉన్నవారు అరటిపండు తింటే ప్రమాదమే!

Banana Problems : ఈ సమస్యలు ఉన్నవారు అరటిపండు తింటే ప్రమాదమే!

HT Telugu Desk HT Telugu
Mar 11, 2023 12:30 PM IST

Banana Side Effects : అరటి దాదాపు అందరికీ ఇష్టమైన పండు. ఇది చాలా ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం. అరటిపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సందర్భాల్లో అరటిపండు తినడం ప్రమాదకరం.

అరటి పండ్లు
అరటి పండ్లు (Pixabay)

అరటిపండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు అరటి పండు తినకపోవడం మంచిది. దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలు ఉన్నవారు వాటిని తీసుకోకపోవడం ఉత్తమం.

మధుమేహం

అరటిపండులో సహజంగా చక్కెర(Sugar) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినకూడదు. మరీ తియ్యగా ఉండే పండ్లకు దూరంగా ఉండాలి.

కిడ్నీ సమస్య

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలతో(Kidney Problems) బాధపడేవారికి హానికరం. వారి శరీరం నుండి అదనపు పొటాషియం విసర్జించడం వారికి కష్టంగా మారుతుంది. అలాంటి వారు అరటిపండు తినకూడదు.

మలబద్ధకం

తరచుగా అపానవాయువు, మలబద్ధకం(Constipation) సమస్యలను ఎదుర్కొనే వ్యక్తులు అరటిపండు వినియోగానికి దూరంగా ఉండాలి. అరటిపండ్లు(Banana) మలబద్ధకం సమస్యను తొలగించడానికి బదులు దానిని మరింత తీవ్రతరం చేస్తాయి.

అలెర్జీ

కొంతమందికి అరటిపండ్లు అంటే అలర్జీ(allergy). అలాంటి వారు అరటిపండుకు పూర్తిగా దూరంగా ఉండాలి. అరటిపండు అలెర్జీలు సాధారణం కాదు. కానీ వాటిని తినడం వల్ల అలర్జీ ఉన్నవారు తింటే వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.

గురక లేదా ఆస్తమా

ఆస్తమా(asthma) రోగులు అరటిపండు తినకూడదు. అరటిపండ్లు తినడం వల్ల వారి సమస్య మరింత పెరుగుతుంది. ఆస్తమా బాధితులు అరటిపండు అస్సలు తినకూడదు.

అరటి పండ్లను తీసుకుంటే.. గుండె జబ్బుల(heart disease)తోపాటుగా పలు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చ అని అంటారు. వాటి ధర కూడా తక్కువే ఉంటుంది. అయితే అతిగా ఏది తిన్నా కూడా సమస్యే. మోతాదుకు మించి.. అరటి పండ్లు తింటే.. ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. అనేక పోషకాహారం కలిగిన గుణాలను కలిగి ఉన్న వీటిని తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు రెండు అరటి పండ్లు తింటే చాలు.

ఎక్కువగా అరటి పండ్లు తింటే మలబద్ధకంతోపాటుగా కొన్ని ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి. అరటిలో కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి. కిడ్నీ బాధితులు అరటి పండ్లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. దంత సమస్యలు కూడా ఈ పండుతో వస్తాయి. డయబెటిక్ బాధితుల అరటి పండ్లు తినొద్దు. ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఎక్కువగా అరటి పండ్లు తింటే.. త్వరగా బరువు పెరుగుతారు. వెంటవెంటనే.. అరటి పండ్లు తింటే నరాలకు హాని కలుగుతుంది. అరటి పండ్లలోని ఫైబర్ తో కొందరికి అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు కూడా వస్తాయి. రోజుకు కేవలం రెండు అరటి పండ్లు తీసుకుంటే చాలు. అంతకంటే ఎక్కుగా తీసుకోవడం మంచిది కాదు.

Whats_app_banner