Banana Side Effects : అరటి పండ్లు ఎక్కువ తింటే సమస్యే.. ఒక్క రోజు ఎన్ని తినాలి?
Banana Side Effects : అరటి పండు తింటే.. ఆరోగ్యానికి మంచిది. అయితే అతిగా ఏది తిన్నా.. విషమే. అరటి పండుతో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాటిని ఎక్కువగా తిన్నా.. దుష్పరిణామాలూ ఉంటాయి.
అన్ని కాలల్లోనూ దొరికే పండ్లలో ఒకటి అరటి(Banana). ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడంతోపాటు రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అరటిలో ఫైబర్(Fiber), విటమిన్లు(vitamins), ఖనిజాలు, షుగర్, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్ల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియలో ప్రధాన పాత్ర పోషించే అరటి పండు.. పేగు కదలికను కూడా నియంత్రిస్తుంది.
అరటి పండ్లను తీసుకుంటే.. గుండె జబ్బుల(heart disease)తోపాటుగా పలు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చ అని అంటారు. వాటి ధర కూడా తక్కువే ఉంటుంది. అయితే అతిగా ఏది తిన్నా కూడా సమస్యే. మోతాదుకు మించి.. అరటి పండ్లు తింటే.. ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. అనేక పోషకాహారం కలిగిన గుణాలను కలిగి ఉన్న వీటిని తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి అదే విధంగా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? రోజుకు రెండు అరటి పండ్లు తింటే చాలు.
ఎక్కువగా అరటి పండ్లు తింటే మలబద్ధకంతోపాటుగా కొన్ని ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి.
అరటిలో కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి.
కిడ్నీ బాధితులు అరటి పండ్లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
దంత సమస్యలు కూడా ఈ పండుతో వస్తాయి.
డయబెటిక్ బాధితుల అరటి పండ్లు తినొద్దు. ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
ఎక్కువగా అరటి పండ్లు తింటే.. త్వరగా బరువు పెరుగుతారు.
వెంటవెంటనే.. అరటి పండ్లు తింటే నరాలకు హాని కలుగుతుంది.
అరటి పండ్లలోని ఫైబర్ తో కొందరికి అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు కూడా వస్తాయి.
రోజుకు కేవలం రెండు అరటి పండ్లు తీసుకుంటే చాలు. అంతకంటే ఎక్కుగా తీసుకోవడం మంచిది కాదు.