DIY Face Pack । అరటిపండుతో ఆరోగ్యమే కాదు, అందాన్ని పొందండిలా!
Banana for Glowing Skin: అరటిపండు తినడానికే కాకుండా చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగపడుతుంది. మెరిసే, మృదువైన చర్మం కోసం అరటిపండు ఫేస్ ప్యాక్ ఉపయోగించండి.
అరటిపండు తినడం ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అరటిపండు చర్మాన్ని మృదువుగా, మెరుసేలా చేయడమే కాకుండా చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. అరటిపండు ఫేస్ ప్యాక్ ముఖంలోని జిడ్డును తొలగిస్తుంది. అలాగే, ఇది మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది.
చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల ఖరీదైన ఉత్పత్తులు, సౌందర్య సాధనాలను ఉపయోగించే బదులుగా ఇంట్లోనే అరటిపండుతో సహజమైన ఫేస్‌ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, తయారు చేసే విధానం కూడా చాలా సులభం.
Banana Face Pack For Glowing Skin -ముఖ కాంతిని పెంచే అరటిపండు ఫేస్ ప్యాక్
వారానికి ఒకసారి అరటిపండు మాస్క్ మీ ముఖానికి వేసుకోవడం వలన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. అయితే చర్మ రకాన్ని బట్టి ఉపయోగించే విధానంలో మార్పు ఉంటుంది. ఏ చర్మ రకానికి అరటిపండు ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
పొడి చర్మం ఉన్నవారికి
మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, అరటిపండు ఫేస్ మాస్క్‌ను తయారు చేసి, దానిని అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి మీకు 2 అరటిపండు, తేనే అవసరం. అరటిపండు తొక్క తీసి మెత్తని ముద్దగా చేయాలి. దీనికి ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.
జిడ్డుగల చర్మం కోసం
అరటిపండు, దోసకాయను సమపాళ్లలో తీసుకొని వేసి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి, ఇందులో కొన్ని బొప్పాయి పండు ముక్కలను కూడా వేసి, ఈ మూడింటిని కలిపి మెత్తని పేస్ట్ చేయండి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఈ ఫేస్ మాస్క్ జిడ్డు చర్మానికి మంచిది, పిగ్మెంటేషన్ సమస్యలను దూరం చేస్తుంది. ఇది చర్మానికి అవసరమైన తేమను కూడా అందిస్తుంది.
మొటిమలను వదిలించుకోవడానికి
పండిన అరటిపండులో ఒక టేబుల్ స్పూన్ వేప పువ్వులు వేసి పేస్ట్ లా చేయాలి. దానికి చిటికెడు పసుపు వేసి ముఖానికి వృత్తాకారంలో రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఈ ఫేస్ ప్యాక్ దాని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో మొటిమలను తగ్గిస్తుంది. వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.
టాన్ తొలగించుకోవడానికి
అరటిపండును మెత్తగా చేసి అందులో ఒక చెంచా శనగ పిండి, కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. శనగపిండి, నిమ్మకాయతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మచ్చలు పోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది, బయటి నుంచి ఇంటికి వచ్చి ఈ ప్యాక్ వేసుకుని ముఖం కడుక్కుంటే ట్యాన్ తగ్గుతుంది.
సంబంధిత కథనం