Danger Signs: చేతులు, కాళ్లు తరచూ చల్లగా మారుతున్నాయా? జాగ్రత్త మీరు ప్రమాదంలో పడతారేమో
Danger Signs: చేతులు, కాళ్లు చల్లగా మారడం అనేది మంచి సంకేతం కాదు. ఆరోగ్యకరమైన మనిషి వెచ్చగా ఉంటాడు. అలా కాకుండా మీలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి.
Danger Signs: చేతులు, కాళ్లు చల్లగా మారడం, పల్స్ పడిపోతున్నట్టు అనిపించడం, లో బీపీతో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం... వంటివి ఆందోళన కలిగించే లక్షణాలు. కానీ వీటిని ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ఇది తక్కువ రక్తపోటు అంటే హైపోటెన్షన్ సంకేతాలు. దీనివల్ల అవయవాలకు తగినంత రక్త ప్రవాహం జరగదు. దీనివల్ల మైకం, అలసట వంటి పరిణామాలు కనిపిస్తాయి. తేలిగ్గా తీసుకుంటే ఆరోగ్యం పెద్ద ప్రమాదంలో పడుతుంది.
ఈ లక్షణాలు ప్రాణాంతకం
రక్త ప్రసరణ ఎప్పుడైతే శరీరంలో సరిగా జరగదు. అప్పుడు శరీరం దాని ఉష్ణోగ్రతను నిర్వహించుకోలేదు. అనేక రకాల సమస్యలు రావడం మొదలవుతాయి. చేతులు చల్లగా మారడం, పాదాలు చల్లగా మారడం, పల్స్ పడిపోవడం ఇవన్నీ కూడా మీలో ఉన్న అంతర్లీన ఆరోగ్య సమస్యలకు కారణాలుగా చెప్పుకుంటారు. ఎప్పుడు ఎలాంటి తీవ్రమైన వ్యాధి బయటపడుతుందో కూడా చెప్పలేము. కాబట్టి మీకు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి.
ఇలా జాగ్రత్తలు తీసుకోండి
తగినంత ద్రవహారాన్ని మీ భోజనంలో ఉండేలా చూసుకోండి. శరీరంలో డిహైడ్రేషన్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటు పెరగడమే కాదు, రక్తపోటు తగ్గడం కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి రోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీళ్లను తీసుకోండి. అలాగే పండ్ల రసాలు వంటివి కూడా తీసుకుంటూ ఉండండి. కూల్ డ్రింకులు పూర్తిగా మానేయడం మంచిది.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం కన్నా చిన్న చిన్న భోజనాలుగా విభజించుకొని రోజులో నాలుగు ఐదు సార్లు తినడం మంచిది. ఒకేసారి పెద్ద భోజనం తినడం అనేది రక్తపోటు తగ్గడానికి కారణం అవుతుంది. అదే చిన్న చిన్న భోజనాలుగా విభజించుకుని తింటే రక్తపోటు పెరగడం గానీ, పెరగడం కానీ జరగదు. అది అదుపులో ఉంటుంది.
కొంతమంది పడుకుని లేచిన వెంటనే మైకం కమ్మినట్టు అనిపిస్తుంది. కళ్ళ ముందు చుక్కల్లాంటివి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా రక్తపోటులో తగ్గుదలను సూచిస్తుంది. కాబట్టి ఒకే చోట గంటల కొద్ది కూర్చోవడం మానేయండి. వ్యాయామం చేయడం, ఇటూ అటూ నడవడం వంటివి ప్రయత్నించండి.
నీ కాళ్లు చేతిలో చల్లగా మారుతుంటే మీ రక్తపోటు కూడా తగ్గుతోందని అర్థం. అలాంటప్పుడు వెచ్చగా ఉన్నాయి. దుస్తులు వేసుకోండి. దుప్పట్లను కప్పుకోండి. మీ శరీరానికి ఉష్ణోగ్రత చాలా అవసరం. కాళ్లు, చేతులు చల్లగా మారుతుంటే శరీరం సరైన ఉష్ణోగ్రతను నిర్వహించుకోలేకపోతున్నదని అర్థం. కాబట్టి శరీర ఉష్ణోగ్రత కాపాడేందుకు బాహ్యంగా కొంత సాయం చేయాలి. ఇలాంటి లక్షణాలు కనిపించేవారు ఏసీని వాడడం పూర్తిగా తగ్గించుకోవాలి.
తక్కువ రక్తపోటు వల్ల చేతులు, కాళ్లు చల్లగా మారడం వంటి లక్షణాలు సెప్సిస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఇది ప్రమాదకరమైనదిగా మారే అవకాశం ఉంది. శరీరంలోని అనేక అవయవాలను దెబ్బతీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎంతో వేగంగా శరీరంలో పాకి పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం అవసరం.
టాపిక్