DIY Beauty Hacks : ఇంట్లో ఉంటూనే మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. ఎలా అంటే..-diy beauty hacks for beauty with kitchen ingredients for amazing results ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Diy Beauty Hacks For Beauty With Kitchen Ingredients For Amazing Results

DIY Beauty Hacks : ఇంట్లో ఉంటూనే మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. ఎలా అంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 23, 2022 07:58 AM IST

Morning Skin Care : అమ్మాయిలు మెరిసే చర్మం పొందడానికి వేలకి వేలు.. ఖరీదైన ఉత్పత్తులను మాత్రమే కాదండి.. కాస్త వంటిట్లోకి వెళ్లండి. మీ చర్మాన్ని మెరిపించే శక్తి మీ ఇంట్లోనే ఉంది. సహజమైన పద్ధతుల్లో మీ వంటగదిలోని కొన్ని పదార్థాలను ఉపయోగించి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. మా ఇంట్లో అవి లేవు అని విజ్ఞాన ప్రదర్శన చేయకండి. వాటిని కొనుక్కోవడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు.

స్కిన్‌కేర్ రొటీన్
స్కిన్‌కేర్ రొటీన్

Morning Skin Care : చాలా మంది రాత్రి చర్మ సంరక్షణను చాలా సీరియస్​గా తీసుకుంటారు. కొందరు అసలు చర్మాన్ని పట్టించుకోరు. మరికొందరు అంతేసి డబ్బులు ఏమి పెడతాములే అని ఆగిపోతూ ఉంటారు. అయితే మీరు మీ కిచెన్​కి వెళ్లండి. అక్కడ మీ చర్మాన్ని సంరక్షించే ప్రాడెక్ట్స్ చాలానే ఉంటాయి. ఉదయాన్నే వాటిని పాటిస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు

స్కిన్‌కేర్ రొటీన్ అనేది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందడానికి తీసుకునే జాగ్రత్తలు అని చెప్పవచ్చు. అవసరమైన అన్ని ఉత్పత్తులు మీ వద్ద లేవని బాధపడకండి. మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోనేందుకు మీ వంటగదిలో ఉన్న పదార్థాలను ఉపయోగించండి. ఎక్కువ ఖర్చు లేకుండా ఈ DIYని సులభంగా తయారు చేయవచ్చు. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం.

క్లెన్సింగ్

కొంచెం పాలు, కొంచెం తేనె తీసుకుని వాటిని కలపండి. ఇప్పుడు కాటన్ బాల్ తీసుకుని మీ ముఖం, మెడకు సమానంగా అప్లై చేయండి. 60 సెకన్ల పాటు మసాజ్ చేసి శుభ్రం చేసుకోండి. పాలలోని లాక్టిక్ యాసిడ్ మీ చర్మాన్ని సున్నితంగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. తేనె తేమను నిలుపుతుంది. పాలలోని లాక్టిక్ యాసిడ్ మీ చర్మాన్ని సున్నితంగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

ఎక్స్‌ఫోలియేటింగ్

మీరు డల్ స్కిన్‌తో బాధపడుతుంటే.. ఈ బ్రైటెనింగ్ స్క్రబ్‌తో మీ ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవచ్చు. మీరు కొంచెం బియ్యాన్ని మెత్తగా పొడి చేయండి. ఆ బియ్యం పిండిని తీసుకుని దానిలో పాలు పోసి పేస్ట్‌ను తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా వృత్తాకార కదలికలలో స్క్రబ్ చేయండి. తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్ మలినాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

టోనింగ్

టోనర్‌లు మీ చర్మం pH స్థాయిలను సమతుల్యం చేస్తాయి. దానికోసం రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. అయితే మీరు ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్‌ను నానబెట్టి.. ఆపై దానిని చల్లార్చి.. రోజ్​ వాటర్​కు బదులుగా దీనిని టోనర్​గా ఉపయోగించవ్చచు.

మాయిశ్చరైజింగ్

మీ ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజింగ్ చేయడం చాలా అవసరం. కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. మీరు కొనుగోలు చేసిన కలబందను కూడా ఉపయోగించవచ్చు. ఇంట్లో తయారుచేసిన ఈ మాయిశ్చరైజర్‌ను తీసుకుని మీ ముఖానికి అప్లై చేయండి. అలోవెరా కొల్లాజెన్, ముఖం మీద మచ్చలను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని తేమగా చేస్తుంది. ఇది మీ చర్మానికి మెరుపును ఇస్తుంది.

మేకప్ తొలగించండి

మేకప్ చేసే ముందు మీ మేకప్ తీయడం మర్చిపోవద్దు. వాటర్‌ప్రూఫ్ ప్రొడక్ట్స్‌తో సహా అన్ని రకాల మేకప్‌లను తొలగించడానికి ఆల్మండ్ ఆయిల్ గ్రేట్​గా పనిచేస్తుంది. ఇది మొటిమల మచ్చలను కూడా పోగొడుతుంది. సూర్యరశ్మిని తగ్గిస్తుంది. పొడి చర్మానికి చికిత్స చేస్తుంది. దానిని వాడితే మీ చర్మాన్ని చికాకు పెట్టడం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్