Fashion Items : డైలీ లైఫ్‌లో ఉపయోగించే ఈ ఫ్యాషన్ ఐటమ్స్ ఆరోగ్యానికి హానీకరం
Fashion Items Affect Health : రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే కొన్ని ఫ్యాషన్ వస్తువులు ఉన్నాయి. అవి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.
ఫ్యాషన్ అనేది సెక్సీగా, హాట్ గా ఆకర్షణీయంగా ఉంటుంది. అందరి ముందు ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. ఇందుకోసం మనం కొన్ని ఫ్యాషన్ వస్తువులు కొంటాం. కానీ కొన్నిసార్లు ఫ్యాషన్ హానికరం కావచ్చు. మిమ్మల్ని ఆకర్షణీయంగా కనిపించే కొన్ని విషయాలు మీకు కీళ్లనొప్పులు కలిగిస్తాయి. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా మంది ట్రెండీ లుక్‌లో కనిపించేందుకు వివిధ రకాల వస్తువులు వాడుతారు. ఇందుకోసం ఇబ్బందులు కూడా పడతారు. కానీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
ఇది మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఉదాహరణకు మీరు వేసుకునే చెప్పులతో పాదంలో ఉన్న అసౌకర్యాన్ని విస్మరిస్తారు. అయితే ఎందుకో ఆలోచించండి. మీ ఆరోగ్యానికి హాని కలిగించే, తీవ్రమైన నొప్పిని కలిగించే ఆరు రకాల బట్టలు మీ గదిలో ఉన్నాయి అంటే మీరు నమ్మకపోవచ్చు. వాటి గురించి తెలుసుకోండి. వాటిని పూర్తిగా నివారించడం సాధ్యం కానప్పటికీ, ఇది చదివిన తర్వాత అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ధరించండి.
పెన్సిల్ హీల్స్
ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మీ ఎత్తుకు మరికొద్దిగా ఎత్తును జోడించడంలో సహాయపడతాయి. కానీ హీల్స్ ధరించడం హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మీ శారీరక స్థితిని ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన ఆర్థరైటిస్‌కు కారణం కావచ్చు. పెన్సిల్ హీల్స్ వేసుకునే అమ్మాయిలకు మోకాళ్లలో లిగమెంట్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మడమ నొప్పి సమస్యను కూడా ఎదుర్కొంటారు.
శాటిన్
శాటిన్ లేదా లేస్ లోదుస్తులను నిరంతరం ఉపయోగించడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఈ బట్టలు ఈస్ట్ లేదా ఫంగస్ పెరగడానికి కారణమవుతాయి. ఈ కారణంగా మహిళలు కాటన్ ప్యాంటీని ధరించాలి. అవసరమైనప్పుడు మాత్రమే ధరించాలి.
స్లిమ్మింగ్ లోదుస్తులు
పొట్ట ఎత్తుగా ఉంటే దాచుకోవడానికి ఇలాంటి దుస్తులు వేసుకోవడం మామూలే. పొట్ట లేనట్టుగా చిన్నదిగా అనిపించినప్పటికీ, అది మీ పొత్తికడుపుపై కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ జీర్ణక్రియ, శ్వాసతో సమస్యలను కలిగిస్తుంది. వేరే అవకాశం లేనప్పుడు మాత్రమే వాటిని ధరించాలి.
స్కిన్నీ జీన్స్
స్కిన్నీ జీన్స్ అనేది దుస్తులలో హాట్ ఐటెమ్. కానీ అందంగా కనిపించేందుకు ఇది వేసుకుంటే.. మీ తొడలకు హాని కలిగిస్తుంది. టైట్ జీన్స్ మీ తొడలను తిమ్మిరి చేసేలా చేస్తుంది. వాటిని విప్పుతున్నప్పుడు చర్మంపై దద్దుర్లు తరచుగా కనిపిస్తాయి.
బ్రాలు
మహిళలు బ్రాలు ధరించడం వలన కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అన్ని బ్రాలు హానికరం కాదు. కొన్ని రకాల బ్రాలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది కండరాల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మహిళలు సరైన సైజు బ్రా ధరించేలా చూసుకోవాలి.