తెలుగు న్యూస్ / ఫోటో /
High Heels :హై హీల్స్ కావవి కిల్లర్ వీల్స్.. హై హీల్స్ ఎంత ప్రమాదమో తెలుసా !
చాలా మంది మహిళలు ట్రెండీ లుక్ కోసం హై హీల్స్ ధరిస్తూ ఉంటారు. అయితే హై హీల్స్ వేసుకునే వారిలో సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మెడ,కాళ్ళు, మోకాళ్ళపై ఒత్తిడి ఎక్కువవుతుంది. వాటిని చాలా కాలం వాడితే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాషన్ కోసం ధీర్ఘకాలం వీటిని వేసుకుంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు
చాలా మంది మహిళలు ట్రెండీ లుక్ కోసం హై హీల్స్ ధరిస్తూ ఉంటారు. అయితే హై హీల్స్ వేసుకునే వారిలో సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మెడ,కాళ్ళు, మోకాళ్ళపై ఒత్తిడి ఎక్కువవుతుంది. వాటిని చాలా కాలం వాడితే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాషన్ కోసం ధీర్ఘకాలం వీటిని వేసుకుంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు
(1 / 5)
చాలా మంది అమ్మాయిలు హీల్స్ ధరించడానికి ఇష్టపడతారు. స్టైలిష్‌గా కనిపించలన్నా ఆలోచనతో వీటిని ధరిస్తుంటారు. అయితే వీటిని ధరించడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది హీల్స్ వేసుకుంటే పాదాలు నొప్పులుంటాయని ఫిర్యాదు చేస్తుంటారు. మరీ ఈ సమస్య రాకుండా ఉండాలంటే, ఏమి చేయాలో చూడండి!
(2 / 5)
హిల్స్ వేసుకున్నప్పడు నొప్పి కలిగితే కొన్ని అత్యవసర జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాదాల నొప్పిని చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే కాళ్ళకు వేసుకునే హిల్స్ మీ పాదాలకు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వదులైనప్పుడు, పాదం వదులుగా ఉండడం వల్ల నొప్పిని కలుగుతుంది. మరోవైపు మరీ బిగుతుగా ఉంటే కాళ్లపై బొబ్బలు రావచ్చు. కాబట్టి కొనే ట్రయల్స్ చూసి సరిపోయే వాటిని ఎంచుకోండి.
(3 / 5)
మన పాదాల ఆకృతి వయస్సుతో పాటు మారుతుంటాయి. ఫలితంగా, మీరు నాలుగు లేదా ఐదు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన హిల్స్ ఇప్పుడు మీ పాదాలకు సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు కొత్త హిల్స్ కొనడం మంచిది.
(4 / 5)
హై హీల్ ధరించినప్పుడు పాదం పైకి ఎత్తినట్లు ఉండడం వల్ల సెంటర్ గ్రావిటీ ముందుకు తోస్తుంది. దీంతో వెన్నెముకపై ప్రభావం పడి శరీర స్థితిలో చాలా మార్పులు వస్తాయి. హై హిల్స్ వేసుకుని ఎక్కువగా నడవకూడదు
(5 / 5)
కాళ్లు బిగుసుకుపోయినా సమయంలో హీల్స్ వేసుకుంటే నొప్పి పెరుగుతుంది. అలాంటప్పుడు, మీరు మొదట ఆ సమస్యను పరిష్కరించాలి. రెగ్యులర్ ఫుట్ మసాజ్, పెడిక్యూర్ చేసుకోవడం ద్వారా మీ పాదాలను అందంగా ఉండడమే కాకుండా, వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అవి కాళ్ళపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది, పాదాల పగుళ్ల సమస్యను కూడా తగ్గిస్తుంది
ఇతర గ్యాలరీలు