Sprouted Potato: మొలకెత్తిన బంగాళదుంపలను వండుతున్నారా? వాటిని తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
Sprouted Potato: బంగాళదుంపలు కొంతకాలానికి మొలకలు వచ్చేస్తాయి. కొంతమంది మొలకలను తీసి ఆ బంగాళా దుంపలను వండుతారు. వాటిని తినడం ఎంతో ప్రమాదకరమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
బంగాళదుంపలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఆహారాలు దీన్ని అనేక రకాలుగా వినియోగిస్తారు. కూరల్లోనూ, బిర్యానీలోనూ, స్నాక్స్ గాను అనేక రకాలుగా ఉపయోగించే వాటిలో బంగాళదుంపలు ఒకటి. వీటిలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే బంగాళదుంపలు తెచ్చాక వారంలోపులే వండేయాలి. రెండు వారాల సమయం గడిచిందంటే అవి మెల్లగా మొలకలు వచ్చేస్తాయి. కొంతమంది ఆ మొలకలను కత్తిరించి ఆ బంగాళదుంపలను వండుతూ ఉంటారు. అలా తినడం ప్రమాదకరమైన చెబుతున్నారు పోషకాహార మిత్రులు.
మొలకెత్తిన బంగాళాదుంపలతో నష్టం
బంగాళదుంపలు మొలకత్తగానే వాటిపై ఆకుపచ్చని మొలకలు పెరుగుతూ ఉంటాయి. క్లోరోఫిల్ కారణంగా ఆకుపచ్చ రంగు వస్తుంది. దానికి కాంతి తగిలినప్పుడు ఈ పచ్చదనం సోలానిన్ అనే విష సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది. మొలకెత్తిన బంగాళదుంపల్లో ఈ విష సమ్మేళనం ఉండే అవకాశం చాలా ఎక్కువ. అందుకే అలాంటి బంగాళదుంపలను తినకూడదని చెబుతూ ఉంటారు.
బంగాళదుంపలు తెచ్చాక వెంటనే వండేయడం ఉత్తమం. లేదా వారంలోపే వాటిని వండి తినేయాలి. ఇవి కాంతికి, వెచ్చదనానికి కాస్త తేమకు గురైతే మొలకెత్తడం మొదలవుతాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ.
ఆలూ దుంపలను ఇలా నిల్వ చేయండి
బంగాళదుంపలు మొలకెత్తకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే వాటికి కాంతి తగలకుండా జాగ్రత్త పడండి. చల్లని వాతావరణంలో పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచేందుకు ప్రయత్నించండి. ఉల్లిపాయల నుండి వాటిని దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే బంగాళదుంపలు మొలకెత్తడాన్ని వేగవంతం చేసే వాయువులు ఉల్లిపాయల్లోనే అధికంగా ఉంటాయి. బంగాళదుంపలను, ఉల్లిపాయలను కలిపి ఎప్పుడూ ఉంచవద్దు.
మొలకెత్తిన బంగాళదుంపలను తినడం వల్ల పోషకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అవి కొత్త రెమ్మల పెరుగుదలకు పోషకాలను నిల్వచేస్తాయి. కాబట్టి అలాంటి బంగాళదుంపలను తిన్నా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఎప్పుడైతే బంగాళదుంపలకు మొలకలు వచ్చాయో పోషకాలు కూడా తగ్గుముఖం పడతాయి.
మొలకెత్తిన బంగాళదుంపల్లో విటమిన్ సి, విటమిన్ b6, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మాత్రం ఉంటాయి. కానీ సోలనిన్ కూడా అధిక స్థాయిలో ఉంటుంది. సోలోనిన్ అనేది ఒక సహజమైన విష పదార్థం. దీన్ని అధికంగా తింటే వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వంట చేయడానికి మొలకెత్తిన బంగాళదుంపలు మంచిది కాదు. వాటిని పడేయడమే మంచిది.
టాపిక్