Milk Health Benefits : చలికాలంలో పాలతో కలిపి ఇవి తీసుకోండి.. ఎందుకంటే..
Health Benefits with Milk : పుట్టిన పిల్లల నుంచి.. పెద్ద వయసు వచ్చినా.. పాలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే చాలామంది పాలు తాగేందుకు చాలా ఇబ్బంది పడరు. దానికోసం ఆ స్మెల్.. పాలు ఫీల్ రాకుండా.. బూస్ట్, హార్లిక్స్ అంటూ కొన్ని కలిపి తీసుకుంటారు. కానీ కొన్ని సహజమైన వాటితో.. హెల్తీగా పాలు తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
Health Benefits with Milk : అన్ని వయసుల పురుషులు, మహిళలు ఆరోగ్యం కోసం పాలు తీసుకోవడం చాలా అవసరం. కానీ మీకు పాల రుచి నచ్చకపోతే లేదా పాలు జీర్ణం కావడంలో సమస్యలు ఉంటే ఏమి చేయాలి? అయితే ఆ సమయంలో ఏమి చేయాలి. పాలను ఎలా తీసుకోవాలి. ఇంతకీ పాలు ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారా?
పాలు చాలా ముఖ్యమైన ఆహారం. కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇవి పాలల్లో తగినంత పరిమాణంలో లభిస్తుంది. అందుకే పాలు తాగాలి అంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే పాల రుచి, వాసనను ఇష్టపడని మార్కెట్‌లో లభించే ఫ్లేవర్‌లను జోడించే బదులు.. ఔషధ గుణాలు అధికంగా ఉన్న సహజ సువాసనలు లేదా కొన్ని మసాలా దినుసులు కలిపి తీసుకోవడం వల్ల పాల నాణ్యతను మెరుగుపరచవచ్చు అంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చినచెక్క పాలు
దాల్చినచెక్క పాలు ఒక గొప్ప పానీయం. మీరు బలమైన రుచిని ఇష్టపడేవారు అయితే.. ఇది మీకు మంచిది. దాల్చిన చెక్కలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ పాల నాణ్యతను మరింత పెంచుతాయి. రోగనిరోధక వ్యవస్థకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క పాలలో చాలా తక్కువ కేలరీలు, అనేక రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. ఇందులోని యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
పసుపు పాలు
ప్రతిరోజూ వంటలో ఉపయోగించే పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. దానిలోని యాంటీఆక్సిడెంట్, క్రిమినాశక లక్షణాల కారణంగా.. ఇది అనేక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. పసుపు పాలు జలుబుకు విరుగుడుగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇది అందానికి చాలా ముఖ్యమైనది. ఔషధ గుణాలు కలిగిన పసుపు పాలను క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.
లవంగం పాలు
లవంగంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని పాలలో కలిపితే దాని నాణ్యత మరింత పెరుగుతుంది. ఈ లవంగాల పాల మిశ్రమం భాస్వరం, అయోడిన్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఇనుము, కాల్షియం, జింక్, సోడియం, పొటాషియం వంటి పోషకాలకు మంచి మూలం. ఇది శృంగార శక్తిని పెంపొందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.
లవంగాలలోని శోథ నిరోధక లక్షణాలు జలుబు, దగ్గు, ఫ్లూకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయని నమ్ముతారు. ఇది చర్మానికి చాలా మంచిది. అంతే కాకుండా దంత సమస్యల నుంచి బయటపడటానికి కూడా సహాయం చేస్తుంది.
తులసి పాలు
మీరు తులసి ఆకుల రుచిని ఇష్టపడితే.. మీరు దానిని మీ పాలతో కలిపి తీసుకోవచ్చు. పాలలో కలిపిన తర్వాత దాని నాణ్యత ఎక్కువగా వస్తుంది. తులసి పాలలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
అంతే కాకుండా సీజనల్ ఫ్లూ, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలకు కూడా ఇది మేలు చేస్తుంది. తులసి పాలు శరీరంలోని యూరిక్ యాసిడ్ మొత్తాన్ని నియంత్రిస్తుంది. మూత్రపిండాల నుంచి విషాన్ని తొలగిస్తుంది. మీరు ఉబ్బసంతో బాధపడుతున్నట్లయితే.. తులసి పాలు మీకు మరింత ప్రయోజనం అందిస్తాయి.
అశ్వగంధ పాలు
అశ్వగంధను ఆయుర్వేదంలో చాలా సంవత్సరాలుగా సహజ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది ప్రమాదకరమైన వ్యాధుల ప్రభావాలను తగ్గిస్తుంది. పాలు, అశ్వగంధ ఆరోగ్యకరమైన కలయిక రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడమే కాకుండా జ్ఞాపకశక్తికి కూడా మేలు చేస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్