Blood Pressure : అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ తాగడం చాలా ప్రమాదకరం!-coffee effect your blood pressure here s how ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Pressure : అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ తాగడం చాలా ప్రమాదకరం!

Blood Pressure : అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ తాగడం చాలా ప్రమాదకరం!

HT Telugu Desk HT Telugu
Apr 03, 2023 08:20 AM IST

Coffee and Blood Pressure : కొంతమందికి ప్రతిరోజూ మూడు నుండి నాలుగు కప్పుల కాఫీ అలవాటు, మరికొందరు గంటకు ఒకసారి కాఫీ తాగుతారు. అయితే ఇలా తాగడం మంచిది కాదు. అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ తాగితే చాలా ప్రమాదకరం.

కాఫీతో సమస్యలు
కాఫీతో సమస్యలు

కాఫీ తాగితే ఉల్లాసంగా ఉంటుందని, లేకుంటే తలనొప్పి వస్తుందని కొంతమంది అంటుంటారు. కానీ కాఫీ(Coffee) తాగడం వల్ల రక్తపోటు(Blood Pressure) పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. కాఫీ తాగిన వెంటనే రక్తపోటులో తాత్కాలిక పెరుగుదల ఉంటుందట. కాఫీ తాగడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుంది. తర్వాత బాగానే ఉంటుంది కానీ తరచూ కాఫీ తాగే అలవాటు ఉంటే శరీరంలో రక్తపోటు చాలా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి గుండెజబ్బులు(Heart Disease) వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే మీరు కాఫీ తాగవచ్చా లేదా కాఫీ తాగడం మానేయాలా? అని డాక్టర్‌తో అడిగి తెలుసుకోండి.

అధిక రక్తపోటు(High Blood Pressure) ఉన్నవారు కొన్ని సమయాల్లో కాఫీ తాగకూడదు. వ్యాయామం, బరువు ఎత్తడం లేదా ఇతర శారీరక శ్రమ చేసే ముందు కాఫీ తాగవద్దు. ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు రక్తపోటు పెరుగుతుంది. మీరు ఇప్పటికే కాఫీ తాగినప్పుడు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవారు కాఫీ తీసుకోవడం తగ్గించడం మంచిది. మీకు కాఫీ(Coffee) ఎక్కువగా తాగే అలవాటు ఉంటే, నెమ్మదిగా తగ్గించుకోండి. మీ హృదయ స్పందన రేటు పెరగడానికి ఇది అవసరం.

అధిక రక్తపోటు ఉన్నవారు ఇవి తాగాలి

అధిక రక్తపోటు ఉన్నవారు.. పాలు(Milk) తాగాలి. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కాఫీకి బదులుగా పాలు తాగడం ప్రారంభించండి. అధిక రక్తపోటు ఉన్నప్పుడు టొమాటో రసం తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.

బీట్‌రూట్ జ్యూస్(beetroot juice) తాగడం ద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగిన 30 నిమిషాల్లో రక్తపోటు తగ్గుతుంది. 45 ఏళ్ల తర్వాత రక్తపోటు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగండి. ఇది రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా హిమోగ్లోబిన్‌ను కూడా పెంచుతుంది.

మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, రెండు వారాల పాటు రోజూ రెండు గ్లాసుల మందార టీ తాగండి. తర్వాత మీరు మీ రక్తపోటును చెక్ చేస్తే ఆశ్చర్యపోతారు. రక్తపోటును నియంత్రించడంలో దానిమ్మ రసం కూడా బాగా సహాయపడుతుంది.

Whats_app_banner