Anjeer Benefits : రక్తపోటు తగ్గాలన్నా.. నిద్రపట్టాలన్నా.. అంజీర్ తినేయండి..-anjeer health benefits know 5 reasons why you should include in your diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Anjeer Health Benefits Know 5 Reasons Why You Should Include In Your Diet

Anjeer Benefits : రక్తపోటు తగ్గాలన్నా.. నిద్రపట్టాలన్నా.. అంజీర్ తినేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 30, 2022 04:50 PM IST

Health Benefits with Anjeer : చాలా మంది డ్రై ఫ్రూట్స్ అనగానే.. బాదం, జీడిపప్పు, కిస్ మిస్, వాల్​నట్స్ అనుకుంటారు కానీ.. వాటిలో అత్యంత ముఖ్యమైనది అంజీర్ అని గుర్తించరు. కానీ దీనివల్ల కలిగే లాభాలు మాత్రం అన్ని ఇన్ని కాదు.

అంజీర్​తో ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్​తో ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits with Anjeer : అంజీర్ అనేవి మనకు పండ్ల రూపంలోనూ.. డ్రై ఫ్రూట్​ రూపంలోనూ అందుబాటులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం చాలా మందికి తెలియదు. అంజీర్ పండ్లు.. సహజంగా కొవ్వు, కొలెస్ట్రాల్ లేని భోజనం. అందుకే బరువు తగ్గాలి అనుకునేవారు కూడా హ్యాపీగా వాటిని డైట్​లో చేర్చుకోవచ్చు. పైగా వీటి రుచి కూడా చాలా గొప్పగా ఉంటుంది. వీటిలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ A, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు మాత్రం వీటిని లిమిట్​గా తీసుకోవాలి. ఇంతకీ వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తపోటును తగ్గిస్తుంది

పొటాషియంలో అసమతుల్యత అధిక రక్తపోటుకు దోహదపడే కారకాల్లో ఒకటి. అత్తి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇవి శరీరంలోని పొటాషియం సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. అత్తి పండ్లలోని అధిక ఫైబర్ కంటెంట్.. శరీరంలోని అదనపు ఉప్పు ఫ్లష్ చేయడంలో సహాయం చేస్తుంది.

మెరుగైన జీర్ణక్రియకై..

అంజీర్ మీ పేగు ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకంతో సహా.. వివిధ రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో పాటు.. ప్రీబయోటిక్స్​కు గొప్ప మూలం. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నిద్రను మెరుగుపరుస్తుంది

అంజీర్ పండ్లు మీ నిద్రను మెరుగుపరుస్తాయి. మెలటోనిన్, నిద్ర చక్రాలను నియంత్రించడానికి, నిద్రలేమి చికిత్సలో సహాయపడుతుంది. అత్తి పండ్లను తిన్నప్పుడు అది శరీరంలోకి విడుదల అవుతుంది. అంజీర్ మెదడులో సెరోటోనిన్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మీ నిద్ర నాణ్యతను పెంచుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

అంజీర్​ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే మెగ్నీషియం, విటమిన్లు సి, ఇ దీనిలో ఉంటాయి. ఈ పోషకాలు స్కాల్ప్ రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి. జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.

మొటిమలు తగ్గించుకోవడానికై..

అంజీర్‌లో మొటిమలను నిరోధించే గుణాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు నిరూపించాయి. నివేదికల ప్రకారం.. ఈ పండ్లు సాధారణ మందులతో సమానంగా పనిచేస్తూ.. మొటిమలను నిరోధిస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం