Anjeer Barfi Recipe : పిల్లల నుంచి పెద్దలవరకు.. ఆరోగ్యం కోసం అంజీర్ బర్ఫీ తినొచ్చు-today special sweet desert recipe is anjeer barfi find the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Special Sweet Desert Recipe Is Anjeer Barfi Find The Making Process

Anjeer Barfi Recipe : పిల్లల నుంచి పెద్దలవరకు.. ఆరోగ్యం కోసం అంజీర్ బర్ఫీ తినొచ్చు

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 08, 2022 06:41 AM IST

Anjeer Barfi Recipe : పిల్లలు స్వీట్ చాలా ఇష్టంగా తింటారు. కానీ అవి ఆరోగ్యానికి మంచివి కాదని.. పెద్దలు వాటిని దూరంగా ఉంచుతారు. కానీ మనం ఇప్పుడు నేర్చుకునే స్వీట్ రెసిపీ.. పిల్లలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. అదే అంజీర్ బర్ఫీ. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అంజీర్ బర్ఫీ
అంజీర్ బర్ఫీ

Anjeer Barfi Recipe : కాజు బర్ఫీ విని ఉంటారు. బాదం బర్ఫీ తిని ఉంటారు. కానీ మీరు అంజీర్ బర్ఫీ విన్నారా ఎప్పుడైనా.. పైగా దీనిని చేయడం చూడా చాలా సులభం. అంతేనా దీనిని కొన్నిరోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు.. మధుమేహం ఉన్నవారు కూడా హ్యాపీగా దీనిని లాగించేయవచ్చు. ఇది టేస్ట్​తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మరి ఇలాంటి స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అంజీర్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు

* అంజీర్ - 1 కప్

* గసగసాలు - 2 టేబుల్ స్పూన్స్

* జీడిపప్పు - 20

* నెయ్యి - 1 టీస్పూన్

* కండెన్స్‌డ్ మిల్క్ - అర కప్పు

* యాలకుల పొడి - అర టీ స్పూన్

అంజీర్ బర్ఫీ తయారీ విధానం

1 కప్పు అంజీర్‌ను కనీసం 2 గంటలు ముందు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దానిని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్‌లో నెయ్యి కరిగించి.. దానిలో అంజీర్ పేస్ట్ వేయండి. కండెన్స్‌డ్ మిల్క్, యాలకుల పొడి వేయండి. మంచి రుచి కోసం దీనిని తక్కువ మంట మీద బాగా కలపుతూ ఉడికించాలి. అనంతరం జీడిపప్పు పొడిని వేసి.. గరిటెతో ఉండలు లేకుండా కలపాలి. అది ఉండలు లేకుండా పేస్ట్​లా మారే వరకు కలపాలి.

ఇప్పుడు దానిపై వెన్నపై వేయండి. బటర్ పేపర్ తీసుకుని.. దానిని సమానంగా పేర్చి గసగసాలు వేయండి. అంజీర్ మిశ్రమాన్ని దానిపై వేసి.. బటర్ పేపర్​ను రోల్ చేయండి. దానిని సుమారు 30 నిమిషాలు పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేపర్ ర్యాప్ తెరిచి ముక్కలుగా చేయండి. మీకు నచ్చిన ఆకారంలో దానిని కట్ చేసుకోవచ్చు. ఇది పార్టీలకు, మీల్ తర్వాత డెజర్ట్​లా పని చేస్తుంది. పైగా దీనిని వారం రోజులకు పైగా నిల్వ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్