Chicken keema paratha: చికెన్ కీమా పరాటా ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు, పిల్లలకు ఇది చాలా నచ్చేస్తుంది
Chicken keema paratha: చికెన్ కీమా నింపిన పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ చాలా సులువు. ఎప్పుడూ చికెన్ కర్రీ, చికెన్ బిర్యాని తిని బోర్ కొడితే ఒకసారి చికెన్ పరాటా చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది.
Chicken keema paratha: పరాటాలు చపాతీలతో పోలిస్తే టేస్టీగా ఉంటాయి. సాధారణ పరాటాలు తిని బోర్ కొడితే ఒకసారి చికెన్ పరాటా చేసుకుని తినండి. దీనివల్ల ఆరోగ్యానికి పోషకాలు అందుతాయి. పొట్ట త్వరగా నిండుతుంది. చికెన్ పరోటా చేయడం చాలా సులువు. చికెన్ పరాటా లంచ్, డిన్నర్ లో తింటే టేస్టీగా ఉంటుంది. చికెన్ పరాటా రెసిపీ ఎలాగో చూద్దాం.
చికెన్ కీమా పరాటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ కీమా - పావు కిలో
గోధుమపిండి - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్
ధనియాలు పొడి - రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కారం - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
పసుపు - పావు స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అరస్పూను
పెరుగు - మూడు స్పూన్లు
నీరు - తగినంత
చికెన్ కీమా పరాటా రెసిపీ
1. పావు కిలో చికెన్ కీమాను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి.
3. చికెన్ కీమా మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టి వదిలేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. మ్యారినేషన్ చేసిన చికెన్ కీమా వేసి బాగా కలపాలి.
6. చికెన్ ఉడుకుతున్నప్పుడు తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి.
7. చికెన్ స్టఫింగ్ కోసం రెడీ అయినట్టే. దాన్ని తీసి పక్కన పెట్టుకోండి.
8. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండి, నీళ్లు వేసి తగినంత ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలుపుకోండి. ఓ పది నిమిషాలు పాటు పక్కన పెట్టండి.
9. ఇప్పుడు పిండి ముద్దను తీసి చపాతీలాగా ఒత్తుకోండి.
10. మధ్యలో చికెన్ కీమాను పెట్టి మళ్ళీ గుండ్రంగా రోల్ చేయండి. దాన్ని ఒత్తితే పరాటాలాగా వస్తుంది.
11. చికెన్ స్టఫ్ బయటికి రాకుండా జాగ్రత్త పడండి.
12. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఈ పరాటాను కాల్చండి.
13. రెండువైపులా రంగు వారే వరకు కలిస్తే చికెన్ పరాటా రెడీ అయినట్టే.
చికెన్ పరాటా తింటే త్వరగా పొట్ట నిండిపోతుంది. చికెన్ లో ఉన్న పోషకాలు శరీరానికి అందుతాయి. చికెన్ పరాటా పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి ఈ చికెన్ పరాటాను ప్రయత్నించి చూడండి మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. చికెన్లో ఇనుము, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తికి ముఖ్యమైనవి. అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి చికెన్ కీమా పరాటాలు తినడం వల్ల అంతా మేలే జరుగుతుంది.
టాపిక్