Chanakya Niti | మనుషులు చేసే మహా పాపం అదే!-chanakya niti insulting them is greater sin ever in life says niti shastra ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti | మనుషులు చేసే మహా పాపం అదే!

Chanakya Niti | మనుషులు చేసే మహా పాపం అదే!

HT Telugu Desk HT Telugu
Jul 13, 2023 06:06 PM IST

Chanakya Niti | మనుషులు చేసే మహా పాపం అదే! ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనుషులు చేసే పాపాలను వివరించారు. మనుషులు చేసే మహాపాపం ఏమిటో వెల్లడించారు.

Chanakya Niti
Chanakya Niti (Unsplash)

Chanakya Niti: జీవితంలో ఏ తప్పు చేయనివారు అంటూ ఎవరూ ఉండరు. ప్రతీ మనిషి ఏదో ఒక సమయంలో తమకు తెలిసో, తెలియకో తప్పులు చేస్తారు. అయితే తెలిసి చేసినా, తెలియకచేసినా తప్పు తప్పే అవుతుంది. ఇందులో కొన్ని క్షమించరాని తప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి తప్పులను పాపంగా పరిగణిస్తారు, అలాంటి వారిని పాపాత్ములుగా పేర్కొంటారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనుషులు చేసే పాపాలను వివరించారు. మనుషులు చేసే మహాపాపం ఏమిటో వెల్లడించారు.

ఆచార్య చాణక్య ప్రకారం.. తల్లితండ్రులకు వారి పిల్లలే వారికి గొప్ప ఆనందాన్నిచ్చే విషయం. తమ పిల్లలు జీవితంలో సాధించే విజయాలను చూసి మురిసిపోతారు, వారు జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగినపుడు అంతకుమించిన ఆనందం ఏ తల్లిదండ్రులకు ఉండదని చాణక్యుడు అభిప్రాయపడ్డారు. అయితే పిల్లలను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు. పిల్లల విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు దైవ సమానులు అని చెబుతారు. అయితే అలాంటి తల్లిదండ్రులను పిల్లలు తాము పెద్దయ్యాక విస్మరిస్తే అది పాపం అని చాణక్యుడు పేర్కొన్నారు.

మానవ జీవితంలో మహా పాపం అదే

ఒక మనిషి ఎవరికైనా ఆయుధంతో చేసే గాయం కంటే మాటతో చేసే గాయం చాలా తీవ్రమైనదని, తన మాటలతోనే ఇతరులకు ఎక్కువ హాని చేయగలడని చాణక్య నీతి చెబుతోంది. విల్లు నుంచి సంధించిన బాణం ఎలా అయితే తిరిగిరాదో నోటి నుంచి వెలువడే వాక్బాణం కూడాఅ అలాగే తిరిగి రాదు. తన మాటలతో, పరుష పదజాలంతో తల్లిదండ్రులను గాయపరిస్తే అది అతి పెద్ద పాపం అని చాణక్య నీతి చెబుతోంది. మనుషుల్లో చాలా మంది తమ తల్లిదండ్రులపై తీవ్రపదజాలాలను ఉపయోగిస్తారు. మాటలతో వారి మనసును గాయపరుస్తూ హింసిస్తారు. ఈ విధంగా తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషించే వ్యక్తులను పెద్ద పాపాత్ములుగా చాణక్యుడు అభివర్ణించారు.

అలాగే తల్లిదండ్రులను కష్టాలలోకి నెట్టేసే వారు, వారు ఇచ్చిన సౌకర్యాలను, ఆస్తులను అనుభవిస్తూ వారికే అన్నం పెట్టని వారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేయడం పెద్ద తప్పిదం అని, మనుషులు తమ జీవితంలో చేసే మహాపాపం ఇదేనని చాణక్యుడు పేర్కొన్నారు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఏం ఇచ్చినా ఆ రుణం తీర్చుకోలేనిది. వారు పిల్లలను పెంచి, పెద్ద చేసి ప్రయోజకులను చేస్తారు. అలాంటి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం పిల్లల ప్రాథమిక బాధ్యత. అదే పుణ్యం.

WhatsApp channel

సంబంధిత కథనం