Breakup Day Quotes | మనసుకు అతిపెద్ద గాయం.. గుండెను కాల్చే మంట ఈ బ్రేకప్!-breakup day quotes telugu if someone can walk away from you let them walk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakup Day Quotes Telugu- If Someone Can Walk Away From You, Let Them Walk

Breakup Day Quotes | మనసుకు అతిపెద్ద గాయం.. గుండెను కాల్చే మంట ఈ బ్రేకప్!

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 10:20 AM IST

Breakup Day Quotes: యాంటీ- వాలైంటైన్స్ వీక్ వారంలో చివరి రోజు ఫిబ్రవరి 21న బ్రేకప్ డేగా నిర్వహిస్తారు తమను ప్రేమలో మోసం చేసిన వారి జ్ఞాపకాలను తగలబెట్టి 'బ్రేకప్' ను వేడుక చేసుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. . ఈరోజుతో యాంటీ- వాలైంటైన్స్ వీక్ ముగుస్తుంది.

Breakup Day Quotes
Breakup Day Quotes (Unsplash)

ప్రేమ ఎంతో మధురం కానీ ప్రియమైన వ్యక్తి కఠినమైనపుడు, ఆ ప్రేమ కూడా కాలకూట విషాన్ని తలపిస్తుంది. మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తి, వారి కోసం గుండెల్లో గుడికట్టి ఆరాధించిన వ్యక్తి మనల్ని కాలదన్ని దూరంగాదూరంగా వెళ్లినపుడు అది ఒక అంతులేని విషాదం. గుండెల్లోంచి దు:ఖం ఉబికుబికి వస్తుంది. చిన్న మనసుకు ఎంత పెద్ద గాయం చేశారనిపిస్తుంది. గుండెకు నిప్పుపెట్టి నిర్ధాక్షణ్యంగా వెళ్లిపోయారనిపిస్తుంది. బ్రేకప్ చేసిన మంట ఎన్ని కన్నీళ్లు కార్చినా చల్లారదు, ఎందరు ఓదార్చిన ఆ బాధ తీరదు.

విడిపోవడం నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి, వారిని ప్రేమించి జీవితంలో చాలా పెద్ద తప్పు చేశామన్న అపరాధ భావన మీలో కలుగుతుంది. ఎంతో నమ్మిన వ్యక్తే నమ్మక ద్రోహం చేసినపుడు, ఇంకా ఏ వ్యక్తిని నమ్మకూడదు అనిపిస్తుంది. మీపై మీకే జాలి, కోపం, అసహ్యం కలుగుతుంది. ప్రతికూల భావాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. జీవితం అంతా శూన్యంగా కనిపిస్తుంది.

కానీ, ఒక్కటి మాత్రం నిజం.. బ్రేకప్ తర్వాత మీతో మీరే చేసుకునే సంఘర్షణ కొంతకాలం వరకే ఉంటుంది. ఇది ఒక కఠినమైన పరిస్థితి, ఈ దశను దాటితే, ఆ తర్వాత నుంచి ఉండే జీవితం ఎంతో అందంగా ఉంటుంది, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Breakup Day Quotes- బ్రేకప్ డే కొటేషన్లు

ముల్లును ముల్లుతోనే అన్నట్లుగా బాధను బాధతోనే ఉపశమనం లభిస్తుంది. బ్రేకప్ మిగిల్చిన బాధ నుంచి ఊరట పొందటానికి కొన్ని బ్రేకప్ కొటేషన్లు (Breakup Quotes), జీవిత సత్యాలను ఇక్కడ చూడండి.

కొంతమంది జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటారు, జీవితంలో కాదు!

---

నిన్ను భారంగా భావించే బంధంలో బలవంతంగా జీవించడం కంటే..

విడిపోయి ఒంటరిగా జీవించటం మేలు!

---

ప్రేమించిన వారిని మోసం చేయడం నీ తప్పు కాదు..

మోసపోయేంతలా నిన్ను ప్రేమించడం నా తప్పు!

---

తమని తామే ప్రేమించుకోవడానికి ఈరోజుల్లో

మరొకరు నిన్ను ప్రేమిస్తారనుకోవడం అవివేకమే!

---

ఆభరణాలు, ఆస్తులపై మక్కువ ఎక్కువ ఉన్నవారికి

మనసు విలువ ఎలా తెలుస్తుంది?

---

కొన్ని జ్ఞాపకాలు ఎంత మధురమైనవైనా

వాటిని గుర్తుపెట్టుకొని బ్రతకడం చాలా కష్టం!

ప్రేమలో విఫలమైనవాడు జీవితాన్ని గెలుస్తాడు అని చెబుతారు. ఒకరి నుంచి విడిపోయినంత మాత్రాన అది మీ అంతం కాకూడదు, మీ నూతన శఖానికి ఆరంభం కావాలి. మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని దూరం చేసుకున్న వారు ఈర్ష్యపడాలి, మిమ్మల్ని చూసి లోకం గర్వించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం