మీ హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల విషయంలో ఏదైనా తప్పు చేసినపుడు లేదా తప్పుగా మాట్లాడినపుడు మీలో అపరాధ భావం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసిన చర్యకు వారు కలత చెందినపుడు, వారి మనసు విరిగిపోయేలా ప్రవర్తించినపుడు వారు మీకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భంలో మీలో అపరాధ భావం మరింత పెరుగుతుంది, మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోవచ్చు. అయినప్పటికీ మీ విషయంలో వారు మీపై కనికరం చూపకపోవచ్చు. అయితే అది మీరు ఎంత పెద్ద తప్పు చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రకమైన బరువైన భావోద్వేగాలు (Guilty Feelings) మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దీర్ఘకాలం పాటు కొనసాగించడం మంచిది కాదు.,మీరు కూడా మీ భాగస్వామితో ఏదైనా విషయంలో అపరాధ భావంతో ఉన్నారా? ఈ అపరాధ భావన మీ మానసిక శ్రేయస్సును దెబ్బతీయడమే కాకుండా మీ సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అపరాధం అనేది ఒక భావోద్వేగం, ఇది మిమ్మల్ని అప్రధానంగా భావించేలా చేస్తుంది. ఒకేరకమైన ఆలోచనలు పదేపదే మీ మనసును తొలుస్తూ ఉంటాయి. మరి ఈ అపరాధ భావం నుంచి బయటపడటం ఎలా? ,Tips To Deal With Guilt Feelings- అపరాధ భావం నుంచి బయటపడే మార్గాలుఇందుకోసం మనస్తత్వవేత్తలు కొన్ని రకాల ఉపాయాలను పంచుకున్నారు, వాటిని పాటించడం ద్వారా మీలో అపరాధ భావం తొలగిపోయి, ఊరట లభిస్తుంది. ఆలోచనలలో స్పష్టత వస్తుంది, మీ సంబంధాన్ని తిరిగి కలుపుకోవడానికి మార్గం చూపుతుంది.,మీరు ఏ తప్పు చేయలేదుమీ అపరాధం చాలా తరచుగా మీకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని గ్రహించాలి. మీరు తప్పు చేశారని మీలో ఒక సహజమైన నమ్మకం ఉన్నప్పటికీ, మీరు ఏ తప్పు చేయలేదని మీకు మీరు అంగీకరించండి. అలాగే మీ పట్ల అవతలి వ్యక్తి కోపంగా ఉన్నారని భావించకూడదు. అవతల వ్యక్తి మీ గురించి ఈరకంగా ఆలోచిస్తుండవచ్చు అని మీకు మీరుగా ఏదో ఆలోచించుకుంటూ ఊహలలో బ్రతకకండి, వాటి నుంచి బయటకు వచ్చి మామూలుగా ఉండండి.,మిమ్మల్ని మీరు క్షమించుకోండి.మీ తప్పులకు మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. మీరు అనుచితమైన పని చేసినట్లు మీకు అనిపించినప్పుడు అపరాధం కలగడం అనేది ఒక సాధారణ ప్రతిస్పందన. కానీ దాని గురించి మీ జీవితాంతం మిమ్మల్ని మీరు నీచమైన వ్యక్తిగా భావించకూడదు. మీకు మీరుగా మీ తప్పులను క్షమించుకోగలగడం, మీ చేదు గతాన్ని మరిచిపోవడం చాలా అవసరం. మీరు అదే తప్పుడు వ్యక్తి కాదని, మీ భాగస్వామికి చూపించే ప్రయత్నం చేయండి. అందుకు పశ్చాత్తాపాన్ని వీలైనంత త్వరగా వ్యక్తం చేయండి.,మిమ్మల్ని మీరు మార్చుకోండిమీ బలాలు, మీ బలహీనతలు మీకు తెలుసు. మీరు ఏ విషయంలో మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టారో తెలుసు. గడిచిన దానిని తిరిగి మార్చలేం కానీ, ఇకపై మళ్లీ అలాంటి తప్పు జరగకుండా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. కొంతమంది తమకు ఉన్న తీవ్రమైన కోపంతో, ఆవేశంతో అవతలి వారితో చాలా కఠినంగా ప్రవర్తించవచ్చు. ఆ ప్రవర్తనను వీడి, ప్రశాంతంగా ఉండటం మిమ్మల్ని మీరు మార్చుకోవడం లాంటిది.,తప్పులు చేయడం సహజంకొన్నిసార్లు తప్పులు దొర్లడం కూడా మన మంచికే అనుకోవాలి. ఒక్కోసారి తప్పు కేవలం మీది మాత్రమే కాదు, అందులో కొంత భాగానికి బాధ్యత మీ భాగస్వామిది ఉండవచ్చు. కాబట్టి మీది మాత్రమే తప్పు అని ఎప్పటికీ అపరాధ భావంతో ఉండకూడదు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వలన కూడా తప్పులు చేయాల్సి రావచ్చు. కాబట్టి దృఢంగా ఉండటం నేర్చుకోండి., ,