Cervical Cancer: భారతీయ మహిళల్లో పెరిగిపోతున్న గర్భాశయ క్యాన్సర్, ఇది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలేమిటి?-cervical cancer is increasing in indian women why does it occur what are its characteristics ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cervical Cancer: భారతీయ మహిళల్లో పెరిగిపోతున్న గర్భాశయ క్యాన్సర్, ఇది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలేమిటి?

Cervical Cancer: భారతీయ మహిళల్లో పెరిగిపోతున్న గర్భాశయ క్యాన్సర్, ఇది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలేమిటి?

Haritha Chappa HT Telugu
Jul 18, 2024 10:30 AM IST

Cervical Cancer: భారతీయ స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. దీన్నే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. దీని లక్షణాలు ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

గర్భాశయ క్యాన్సర్
గర్భాశయ క్యాన్సర్ (Shutterstock)

ప్రపంచంలో మహిళలకు వస్తున్న క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. దీన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఒకటి. ఇది గర్భాశయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే క్యాన్సర్. గర్భాశయంలో అసాధారణంగా కణాలు పెరిగి కణితిలాగా మారుతాయి. అదే క్యాన్సర్ గా మారుతుంది. ప్రతి మహిళ గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలి. దీని లక్షణాలను తెలుసుకుంటే ప్రాథమిక దశలోనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాంతకంగా మారకుండా జాగ్రత్త పడవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల వచ్చే అవకాశం ఎక్కువ. ఇది లైంగిక సంబంధం ద్వారా వ్యాప్తి చెందే అత్యంత సాధారణ వైరస్. భారతీయ మహిళల్లో, గర్భాశయ క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల క్యాన్సర్లలో ఒకటిగా మారిపోయింది. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కనవ్ కుమార్ హిందూస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "గర్భాశయ క్యాన్సర్ భారతీయ మహిళల్లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. ఏటా దీని బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతోంది. 53 మంది భారతీయ మహిళల్లో ఒకరికి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. కానీ భారతీయ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఎందుకు ఎక్కువగా వస్తోందో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి’ అని చెబుతున్నారు.

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు

గర్భాశయ క్యాన్సర్ కేవలం మహిళలకు మాత్రమే వచ్చే క్యాన్సర్. ఎందుకంటే వీరికి మాత్రం గర్భాశయం ఉంటుంది. దీని లక్షణాలు ప్రతి మహిళా తెలుసుకోవాలి. పీరియడ్స్ సమయంలో కాకుండా సాధారణ సమయంలో కూడా అప్పుడప్పుడు రక్తస్రావం అవుతుంటే తేలికగా తీసుకోకండి. మూత్ర విసర్జన చేశాక, సెక్స్ లో పాల్గొన్న తరువాత నొప్పి వస్తున్నా కూడా వైద్యులను సంప్రదించాలి. యోని నుంచి రక్తంలో కూడిన నీరు లాంటి పదార్థం వస్తున్నా, మెనోపాజ్ వచ్చాక కూడా రక్తస్రావం జరుగుతున్నా, కటి భాగంలో విపరీతంగా నొప్పి వస్తున్నా వైద్యులను సంప్రదించి గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

గర్భాశయ క్యాన్సర్ చికిత్స

గర్భాశయ క్యాన్సర్ విషయంలో, శస్త్రచికిత్స కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో గర్భాశయం, అండాశయాలు, గర్భాశయంలోని కణితులు వంటివి తొలగించడం జరుగుతుంది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటివి కూడా చేస్తారు. ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేట్ థెరపీ (IMRT), ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ (IGRT) వంటి థెరపీలను కూడా అందిస్తారు. ఏది ఏమైనా గర్భాశయ క్యాన్సర్ మహిళల పునరుత్పత్తి వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. యువతుల్లో ఈ క్యాన్సర్ వస్తే పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంది.

గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

గర్భాశయ క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు. ఇది రావడానికి కారణాలు కూడా ఎక్కువే. DNA కణాలు మ్యుటేషన్ చెందినప్పుడు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఒకరి కన్నా ఎక్కువ వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకున్నా కూడా హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం సోకుతుంది. లైంగికంగా సోకే అంటు వ్యాధులైన క్లామిడియా, సిఫిలిస్, గోనేరియా , ఎయిడ్స్ వంటి వ్యాధుల వల్ల కూడా గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఈ క్యాన్సర్ వచచే అవకాశం పెరుగుతుంది. స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో కూడా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

Whats_app_banner