Brown Rice Chicken Biryani । బ్రౌన్ రైస్‌తో బిర్యానీ.. బరువు పెరుగుతామనే భయం లేకుండా తినొచ్చు!
Brown Rice Chicken Biryani Recipe: బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి మీరు బ్రౌన్ రైస్‌తో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్‌తో బిర్యానీని ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Healthy Rice Recipes: బరువు తగ్గడం కోసం చాలా మంది అన్నం తినకుండా ఉంటారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నం పూర్తిగా మానేయాలి అని భావిస్తారు. కానీ ఘుమఘుమలాడే దమ్ బిర్యానీని చూస్తే మాత్రం తినకుండా ఉండలేరు. దీంతో బరువు తగ్గాలనే వారి లక్ష్యం పక్కదారి పడుతుంది. మరి అలాంటపుడు మనకు ఇష్టమైన బిర్యానీని త్యాగం చేయాలా? అంటే అలాంటి అవసరం లేదు. సాధారణ అన్నంకు బదులు బ్రౌన్ రైస్ తినండి. తెల్ల బియ్యంతో పోలిస్తే , బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తేలికైన ఆహారంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి
మీరు బ్రౌన్ రైస్‌తో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఈ బ్రౌన్ రైస్ చికెన్ బిర్యానీ ఆనేది పాపులర్ చికెన్ బిర్యానీకి ఆరోగ్యకరమైన వెర్షన్. దీని తయారీకి బ్రౌన్ బాస్మతి బియ్యం లేదా జాస్మిన్ రైస్ ఉపయోగించవచ్చు. తాజా మూలికలు, సుగంధ ద్రవ్యాలతో కలిపి వండితే అద్భుతమైన రుచి వస్తుంది. ఇది ఒక ఫేవ్ ఫీల్ గుడ్ కంఫర్ట్ ఫుడ్. బ్రౌన్ రైస్ బిర్యానీ రెసిపీని ఈ కింద చూడండి.
Brown Rice Chicken Biryani Recipe కోసం కావలసినవి
- 2 కప్పుల బ్రౌన్ బాస్మతి బియ్యం
- 1 కిలో చికెన్
- 2 టీస్పూన్లు గరం మసాలా
- 1 టేబుల్ స్పూన్ అల్లం
- 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
- 1 టేబుల్ స్పూన్ కారం
- 1/2 టీస్పూన్ పసుపు
- 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
- 1 పెద్ద ఉల్లిపాయ
- 2 బిర్యానీ ఆకులు
- 1/4 కప్పు పుదీనా ఆకులు
- 1/4 కప్పు కొత్తిమీర
- 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం
- 1 కప్పు సాదా పెరుగు
- 2-4 టీస్పూన్ కోషర్ ఉప్పు
- 1 టీస్పూన్ కుంకుమపువ్వు
బ్రౌన్ రైస్ చికెన్ బిర్యానీ తయారీ విధానం
- ముందుగా బ్రౌన్ బాస్మతి బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి వడకట్టండి. 2 కప్పుల గోరువెచ్చని నీరు పోసి బియ్యాన్ని 3 గంటలు నానబెట్టండి.
- ఈలోపు గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, పుదీనా ఆకులు, తరిగిన కొత్తిమీరలో సగం, నిమ్మరసం, పెరుగు, ఉప్పు అన్నీ వేసి మెరినేడ్ తయారు చేయండి.
- సిద్ధం చేసుకున్న మసాలాలో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను ముంచి బాగా కలిపి 2-3 గంటలు రిఫ్రిజిరేటర్లో ఉంచండి.
- ఆ తర్వాత, ఇన్‌స్టంట్ పాట్‌ను లేదా కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేయండి, అది వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి, ఉల్లిపాయలో సగం తీసి బిర్యానీకి గార్నిష్ చేయడానికి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు బిర్యానీ ఆకులు ఆకులు వేయండి, ఆపైన మెరినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలపుతూ వేయించండి.
- ఇప్పుడు నానబెట్టిన బ్రౌన్ రైస్ నెమ్మదిగా వేయండి, చికెన్ మీద బియ్యం సమానంగా విస్తరించండి. ఆపై ఇందులో 1½ టీస్పూన్ ఉప్పు, 1 కప్పు నీరు వేసి మూత పెట్టండి. 10 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించండి.
- అనంతరం ఇన్‌స్టంట్ పాట్‌ని తెరిచి, అన్నం పై పొరను సున్నితంగా కదిలించండి, అన్నం ఉడకనిదిగా అనిపిస్తే, ఇన్‌స్టంట్ పాట్‌ను మూసివేసి, మరో 10 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించండి
- చివరగా మూత తెరిచి వేయించిన ఉల్లిపాయలు, కుంకుమపువ్వు, కొత్తిమీరతో అలంకరించండి.
అంతే, బ్రౌన్ రైస్ చికెన్ బిర్యానీ రెడీ. రైతా, సలాన్, ఉడికించిన గుడ్డు, నిమ్మకాయ ముక్కలతో వేడివేడిగా సర్వ్ చేయండి.
సంబంధిత కథనం