Saffron in pregnancy: కుంకుమ పువ్వు వల్ల పిల్లలు తెల్లగా పుడతారా? మోతాదు మించితే నష్టాలివే..-taking saffron in pregnancy its benefits and cautions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saffron In Pregnancy: కుంకుమ పువ్వు వల్ల పిల్లలు తెల్లగా పుడతారా? మోతాదు మించితే నష్టాలివే..

Saffron in pregnancy: కుంకుమ పువ్వు వల్ల పిల్లలు తెల్లగా పుడతారా? మోతాదు మించితే నష్టాలివే..

Koutik Pranaya Sree HT Telugu
May 25, 2023 04:50 PM IST

Saffron in pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, మోతాదుకు మించి తీసుకుంటే కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

కుంకుమ పువ్వు
కుంకుమ పువ్వు (pexels)

ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ మంచి రంగులో ఉంటారని చెప్తుంటారు. అలా చెబితే అయినా తప్పకుండా ప్రెగ్నెన్సీ సమయంలో దీన్ని తీసుకుంటారని చెప్పుంటారు. దీనివల్ల కలిగే లాభాలు బోలెడు మరి. దీనివల్ల నిజంగానే బిడ్డ రంగు మీద ప్రభావం ఉంటుందా? కుంకుమ పువ్వు ఎప్పుడు, ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో చూడండి.

ఎప్పటి నుంచి తీసుకోవాలి:

కుంకుమ పువ్వును ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు తీసుకోకూడదు. ఎందుకంటే కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల గర్భాశయ కండరాల కదలిక పెరుగుతుంది. మొదటి మూడు నెలల్లో దీన్ని తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.

రోజుకు ఎంత తీసుకోవాలి:

నాలుగో నెల నుంచి కుంకుమ పువ్వు తీసుకోవడం చాలా మంచిది. ఇది సుఖ ప్రసవానికి సాయపడుతుంది. అలాగని ఏదైనా మితంగానే తీసుకోవాలి. రోజుకు 0.5 నుంచి 2 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే చిటికెడు అన్నమాట. అదే ఆరోగ్యానికి మంచిది. గర్భాశయ కండరాలు చురుగ్గా ఉండి, సుఖ ప్రసవానికి మేలు చేస్తుంది.

కుంకుమ పువ్వు లాభాలు:

  • ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మందిలో మూడ్ స్వింగ్స్ కనిపిస్తుంటాయి. కుంకుమ పువ్వు వాటిని తగ్గిస్తుందట.
  • బీపీ నియంత్రించడంలో ఇది సాయపడుతుంది.
  • కొంతమందికి కాళ్లల్లో, పొత్తి కడుపులో వచ్చే నొప్పులను ఇది తగ్గిస్తుంది.
  • కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • ఆందోళనను తగ్గిస్తుంది.
  • నిద్ర బాగా పట్టేలా సాయపడుతుంది.

బిడ్డ రంగుకి కుంకుమ పువ్వుకి సంబంధం ఉందా?:

పుట్టబోయే బిడ్డ రంగు పూర్తిగా జన్యువుల మీద ఆధార పడి ఉంటుంది. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బిడ్డ రంగు మీద ప్రభావం ఉండదు. కానీ దీనివల్ల ఉన్న లాభాల వల్లే ప్రెగ్నెన్సీ సమయంలో దీన్ని తీసుకోవాలని సూచిస్తారు.

కుంకుమ పువ్వు ఎలా తీసుకోవాలి?

పాలలో కాస్త పంచదార, అర గ్రాము నుంచి రెండు గ్రాముల కుంకుమ పువ్వు వేసి రెండు నిమిషాలు మరిగించి దించేయాలి.

ఇంకో పద్ధతి:

రెండు చెంచాల పాలలో కుంకుమ పువ్వు రెండు గంటలు నానబెట్టి. వేడి చేసిన పాలలో ఈ కుంకుమ పువ్వు కలిపిన పాలు, ఇష్టమైన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి, బాదాం వేసి తాగొచ్చు.

ఎలాంటి కుంకుమ పువ్వు కొనాలి?

గడువు తేదీ ముద్రించని కుంకుమ పువ్వు కొనకూడదు. బయట మార్కెట్లో ఎలాంటి ప్యాకేజింగ్ లేనివి అసలే వాడకూడదు. కుంకుమ పువ్వు ధర ఎక్కువవడం వల్ల దీన్ని ఎక్కువగా కల్తీ చేస్తుంటారు. అందుకే ధర ఎక్కువైనా, సరైన బ్రాండ్, గడువు తేదీ చూసి కొన్నివి మాత్రమే వాడాలి.

Whats_app_banner