Broccoli vs Cauliflower: బ్రకోలి vs కాలీఫ్లవర్... ఈ రెండిట్లో ఏది తింటే బెటర్
Broccoli vs Cauliflower: బ్రకోలి vs కాలీఫ్లవర్... ఈ రెండు కవల పిల్లల్లా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది తింటే ఆరోగ్యకరమో చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
Broccoli vs Cauliflower: బ్రకోలి vs కాలీఫ్లవర్.. ఈ రెండింటి రంగులు వేరు, కానీ రూపాలు ఒకటే. చూడడానికి రెండు కవల పిల్లల్లా ఉంటాయి. ఈ రెండూ కూడా క్రూసిఫెరస్ కూరగాయల కుటుంబానికి చెందినవే. చాలామందికి ఈ రెండిట్లో ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయో తెలుసుకోవాలని ఉంటుంది. రెండింట్లో బ్రకోలి కాస్త ఖరీదైనది, కాలీఫ్లవర్ అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే లభిస్తుంది.
బ్రకోలి
ఇది ఒక పోషకాల పవర్ హౌస్‌గా చెప్పుకోవచ్చు. విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ బ్రకోలి అధిక స్థాయిలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే ను కలిగి ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు బ్రకోలీలో నిండుగా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బ్రకోలీలో సల్పోరాఫెన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుంది. బ్రకోలీని తరచూ తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
కాలీఫ్లవర్
ఇది లేత తెలుపు రంగును కలిగి ఉంటుంది. దీంతో అనేక రకాలైన వంటకాలను చేసుకోవచ్చు. దీనిలో కూడా మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాలీఫ్లవర్లో కూడా విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తం గడ్డ కట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కె కూడా కాలీఫ్లవర్లో ఉంటుంది. అంతేకాదు కాలీఫ్లవర్లో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి ఎంత తిన్నా దీనిలో ఉండే అధిక ఫైబర్ సమతుల్య ఆహారానికి అవసరం. జీర్ణ ఆరోగ్యాన్ని పోషించే లక్షణాలు కాలీఫ్లవర్లో ఉన్నాయి. దీనిలో ఉండే ప్రత్యేకమైన సమ్మేళనాలు శరీరాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి. అలాగే గుండెకు రక్షణ కలిగిస్తాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. రుచితో పోలిస్తే కాలీఫ్లవర్ రుచి బాగుంటుంది. దీని ధర కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది కాలీఫ్లవర్ ని తినడానికి ఇష్టపడతారు.
ఏది బెటర్?
విటమిన్ సి కోసం తినే వారైతే బ్రకోలీని తినడమే మంచిది. కాలీఫ్లవర్ కన్నా విటమిన్ సి బ్రొకోలీలోనే ఎక్కువ ఉంటుంది. మిగతావన్నీ కూడా కాలీఫ్లవర్, బ్రకోలీలో సమతలంగానే ఉంటాయి. ధరను బట్టి మీరు ఏది కొనుక్కోగలరో... దాన్నే కొనుక్కొని తినడం బెటర్. కాలీఫ్లవర్ అయితే అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్రకోలీనే తినాలన్న నియమం లేదు. కాలీఫ్లవర్ తో కూడా సరి పెట్టుకోవచ్చు.
టాపిక్