Botox Injections : ముఖంపై ముడతలకు బొటాక్స్ ఇంజెక్షన్.. మంచిదేనా?
Botox Injections : ముఖంపై ముడతలు తగ్గించేందుకు ప్రధానంగా బొటాక్స్ ఇంజక్షన్ వాడుతుంటారు. అతి తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి మంచివేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
ముఖం మీద ముడుతలను(Wrinkles on the face) తొలగించడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు(Botox Injections) అందుబాటులో ఉన్నాయి. యవ్వనంలో అందంగా ఉంటాం. కానీ వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోయి ముఖంలో ముడతలు వస్తాయి. వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. కానీ అధునాతన టెక్నాలజీ(Technology) కారణంగా రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. బాహ్య సౌందర్యానికి సంబంధించి అనేక ఆవిష్కరణలు ఉన్నాయి. సామాన్యులు సైతం సెలబ్రిటీలలాగా అందాన్ని కాపాడుకునేందుకు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల, ముఖం ముడుతలను తొలగించడానికి బొటాక్స్ డెర్మల్ ఫిల్లర్స్ వంటి ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
చాలా కాస్మెటిక్ ట్రీట్‌మెంట్(cosmetic treatment)ల మాదిరిగానే, మీ సమస్యలన్నింటినీ ఏ ఉత్పత్తి కూడా పరిష్కరించదు. బొటాక్స్ అనేది ఒక టాక్సిన్, ఇది ఇంజెక్షన్ ద్వారా కండరాలను తాత్కాలికంగా స్తంభింపజేస్తుంది. దీని కారణంగా, ఈ ఇంజెక్షన్ ఇచ్చిన ప్రదేశంలో మీ శరీర కండరాల కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. అధిక కండరాల చర్య సాధారణంగా ముడతలకు దారితీస్తుంది. బొటాక్స్‌ను ముఖ ముడుతలకు ఇంజెక్ట్ చేసినప్పుడు, ఇది ముఖ మైమెటిక్ కండరాల కార్యకలాపాలను తగ్గిస్తుంది. ఇది ముడతల అభివృద్ధిని ఆపుతుంది.
ఈ వినూత్నమైన కొత్త ఇంజెక్షన్లు తాత్కాలిక అందాన్ని అందిస్తాయి. కానీ ఇలాంటి ట్రీట్ మెంట్లు అతిగా చేయడం వల్ల తాత్కాలిక ఫలితాలు రావడం వల్ల మీ చర్మంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫిల్లర్లు, బొటాక్స్ ఫలితాలు తాత్కాలికమైనవి అయినప్పటికీ, అవి చాలా నెలలు ఉంటాయి.
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు విముక్తి కగిగించేందుకు ముఖంపై ఇచ్చే ఈ ఇంజక్షన్.. ఖరీదు వేలల్లో ఉంటుంది. ఇది నిజానికి బోట్యులైనమ్ టాక్సిన్ అనే విషపూరితమైన పదార్థం. కొంత బోట్యులైనమ్ టాక్సిన్ అనేది చాలా మందిని చంపేయగలదు అని చెబుతారు. ముఖంపై ముడతలు తగ్గించేందుకు ప్రధానంగా బొటాక్స్ ఇంజక్షన్ తీసుకుంటారు. అయితే చర్మం(Skin) ముడతలు పడటానికి కారణమైన ధమనులను ఇది నాశనం చేస్తుంది. బొటాక్స్ ఇంజక్షన్.. తక్కువ మోతాదులో ఇ్తారు. ఒక గ్రాములో కొన్ని కోట్ల వంతు బొటాక్స్ ను సలైన్ లో కలిపి ఇంజక్షన్ రూపంలో ఎక్కిస్తారు. అయితే దీనిద్వారా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.