Unwanted Facial Hair । ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించేందుకు సహజమైన మార్గాలు ఇవిగో!-get rid of unwanted facial hair in natural ways check hair removal diy face packs here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Unwanted Facial Hair । ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించేందుకు సహజమైన మార్గాలు ఇవిగో!

Unwanted Facial Hair । ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించేందుకు సహజమైన మార్గాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

Unwanted Facial Hair: ఆడవారి ముఖంపై అవాంఛిత రోమాలు వారి రూపాన్ని దెబ్బతీస్తాయి. ఈ సమస్యకు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా పరిష్కారం చూపవచ్చు, అది ఇక్కడ తెలుసుకోండి.

Unwanted Facial Hair (Unsplash)

పురుషులకు ముఖంపై గడ్డం, మీసాలు రావడం సహజం. పురుషులకు ఈ వెంట్రుకలు అలంకరప్రాయమే. కానీ ఈ ముఖ వెంట్రుకలు (Unwanted Facial Hair) మహిళల రూపాన్ని పాడు చేస్తాయి. ముఖ్యంగా కొంతమంది మహిళలకు ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వారు తమ ముఖం చూపించుకోలేక ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి కారణంగా ఆడవారి ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఆండ్రోజెన్ హార్మోన్లు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం వల్ల వారి ముఖం, శరీర భాగాలపై అవాంఛిత రోమాలు అభివృద్ధి చెందుతాయి.

స్త్రీల ముఖంపై వెంట్రుకలు ఉండటం వల్ల వారి ముఖంలో కళ తగ్గుతుంది. మేకప్ వేసినా ఉపయోగం ఉండదు. దీని నుంచి బయటపడేందుకు చాలా మంది ఆడవారు షేవింగ్, వ్యాక్సింగ్, థ్రెడింగ్ లతో తొలగించుకోటానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పద్ధతులు వారి చర్మాన్ని నాశనం చేస్తాయి. కొంతమంది ఖరీదైన, బాధాకరమైన లేజర్ ట్రీట్‌మెంట్లను చేయించుకుంటారు. అయితే ఇలాంటివి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే చూపుతాయి. అయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదు, కొన్ని సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించి ఇంట్లోనే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫేస్ ప్యాక్‌లు ఏవో, ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

Hair Removal DIY Face Packs- బొప్పాయి- పసుపు ఫేస్ ప్యాక్‌:

పచ్చి బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది, అదనంగా జుట్టు పెరుగుదలను నిరోధిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల పచ్చి బొప్పాయి పేస్టులో అర టీస్పూన్ పసుపు కలపండి. దీన్ని ముఖానికి పట్టించాలి. అది ఆరిన తర్వాత, జుట్టు పెరిగే దిశలో తడి చేతులతో సున్నితంగా స్క్రబ్ చేయండి. తర్వాత కడిగేసుకోండి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు వేసుకుంటే ముఖంపై వెంట్రుకలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

బంగాళదుంపలు- బుక్వీట్ ఫేస్ ప్యాక్‌:

బంగాళదుంపలు బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ముఖంలోని వెంట్రుకలను తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉడికిన బంగాళదుంప పేస్ట్‌లో బుక్వీట్ పిండి వేసి కలపాలి. దానికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె వేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోండి. దీనిని 20 నిమిషాలు ఆరనివ్వండి. ఆపై స్క్రబ్ చేసి, శుభ్రం చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం ఈ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు అప్లై చేయండి. ఈ నేచురల్ ప్యాక్ ముఖంలోని వెంట్రుకలను తొలగించి, మెరుపును అందిస్తుంది. అలాగే డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది.

పసుపు - గంధపు పొడి ఫేస్ ప్యాక్‌

కస్తూరి పసుపు, గంధపు పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం, ఆవాల నూనెను కలిపి పేస్ట్ చేయండి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోండి. ఆరిన తర్వాత స్క్రబ్ చేయాలి. 20-30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీన్ని వారానికి మూడుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు పెరగకుండా చేస్తుంది.

ఓట్స్- తేనె ఫేస్ ప్యాక్‌

ఓట్స్ గ్రైండ్ చేసి, నిమ్మరసం, తేనె కలిపి పేస్ట్ చేయాలి. తర్వాత ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత నీటితో తడిపి మృదువుగా మసాజ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

ఎగ్- కార్న్ స్టార్చ్ మాస్క్

గుడ్డులోని తెల్లసొన తీసుకుని దానికి అర చెంచా మొక్కజొన్న పిండి , 1 చెంచా పంచదార కలపండి. మెత్తని పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. మాస్క్ జుట్టుకు అతుక్కుపోయిందని నిర్ధారించుకోండి. మాస్క్ ఆరిన తర్వాత, మొదట మాస్క్‌ను తీసివేసి, ఆపై మీ ముఖాన్ని కడగాలి.

బియ్యప్పిండి - పసుపు ప్యాక్‌

2 చెంచాల బియ్యప్పిండి, 1/2 చెంచా పసుపు పొడిని పాలతో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

ముఖంపై వెంట్రుకలు తగ్గడానికి, మీ ముఖం మృదువుగా, కాంతివంతంగా మార్చడానికి ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.

సంబంధిత కథనం