Curd After Lunch : భోజనం తర్వాత పెరుగు తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా?
Curd After Lunch : పెరుగుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది అన్నంతోనే పెరుగును తీసుకుంటారు. అయితే భోజనం తర్వాత పెరుగును తీసుకుంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి.
పెరుగు ప్రయోజనాలు(Curd Benefits) అంతులేనివి. మధ్యాహ్న భోజనం తర్వాత ఒక గిన్నె పుల్లటి పెరుగు తినడం చాలా మందికి అలవాటు. వైద్యుల ప్రకారం, ప్రతిరోజూ పుల్లటి పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది. తద్వారా శరీరం వ్యాధుల నుండి దూరంగా ఉంటుంది. పెరుగు కూడా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు పెరుగు తినడం చాలా ముఖ్యం.
పెరుగును రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్న భోజనం తర్వాత పుల్లని పెరుగు(Curd After Lunch) తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకోండి.
పుల్లటి పెరుగు బరువు తగ్గడానికి(Weight Loss) చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అయితే మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగు తినడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. పుల్లటి పెరుగు కార్టిసాల్ లేదా స్టెరాయిడ్ హార్మోన్ల స్రావాన్ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ అధికంగా స్రవించడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం పుల్లని పెరుగు ప్రయోజనాల్లో ఒకటి. పెరుగు వివిధ వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు మధ్యాహ్న భోజనం తర్వాత ఒక గిన్నె పెరుగు తినండి.
పుల్లటి పెరుగు ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా యోనిలోని ఈస్ట్‌ను సమతుల్యంగా ఉంచుతుంది. పుల్లటి పెరుగు మహిళలకు చాలా మేలు చేస్తుంది.
అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటు రోగులు కూడా పుల్లని పెరుగు తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు.
గ్యాస్, గుండెల్లో మంట సమస్యను తగ్గించడంలో కూడా పెరుగు సహాయపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి కడుపునకు నిజంగా మేలు చేస్తాయి. పుల్లటి పెరుగులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియకు సంబంధించిన ఆటంకాలను దూరం చేస్తాయి.