Mint Leave Face Pack : పుదీనా ఫేస్ ప్యాక్ వాడితే ఒక్క వారంలో మెుటిమలు, బ్లాక్ హెడ్స్ మాయం
Beauty Tips : పుదీనా ఆకులు ముఖ చర్మానికి ఎంతో పోషణనిస్తాయి. దాదాపు అన్ని చర్మ సంబంధిత సమస్యలకు ఇది అద్భుతమైన మందు అని చెప్పవచ్చు. దీనిని ఫేస్ ప్యాక్‌లా తయారుచేసి వాడవచ్చు.
పుదీనా మన వంటలలో ఉపయోగించే రుచికరమైన, ఔషధ ఆకు. అయినప్పటికీ ఇది చర్మ సంరక్షణకు అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటుంది, అందిస్తుంది. అలాగే ఈ ఆకు సహజ యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ చర్మానికి సాయపడుతుంది. వారం రోజులపాటు పుదీనాతో చేసిన ఫేస్ ప్యాక్ వాడండి.
ఈ లక్షణాలు చర్మాన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, మొటిమలు లేకుండా, మచ్చలు లేకుండా చేస్తాయి. కూలింగ్ గుణాల వల్ల మీరు దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో మీ చర్మ సంరక్షణ కోసం పుదీనా ఆకులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం..
దోసకాయ, పుదీనా ఆకులు
అరకప్పు దోసకాయ ముక్కలను పావు కప్పు సన్నగా తరిగిన పుదీనా ఆకులను కలిపి బాగా గ్రైండ్ చేసి, ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15-20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెుటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. వారం రోజులపాటు ఈ చిట్కాను పాటించండి.
ముల్తానీ మట్టి, పుదీనా ఆకు
కొన్ని పుదీనా ఆకులను బాగా గ్రైండ్ చేసి, ఒక పెద్ద చెంచా ముల్తానీ మట్టి, కొంచెం రోజ్ వాటర్ కలిపి ఆ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
రోజ్ వాటర్, పుదీనా ఆకులు
పుదీనా ఆకులను, కొద్దిగా రోజ్ వాటర్ ను గ్రైండ్ చేసి మొటిమలు, మచ్చలపై రాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
మరో చిట్కా
మీ ముఖంపై ముడతలు లేదా సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు ఉంటే, కొబ్బరి నూనె, ఆముదం ఉపయోగించండి. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా ముఖంపై వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. అలాగే ఇది ముడతలు, ఫైన్ లైన్ల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
ఈ రెండు నూనెల మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు మీ ముఖంపై రాయండి. మీ చర్మం నునుపుగా మారుతుంది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే పొడి చర్మం ఉన్నవారు దీన్ని రోజూ ముఖానికి రాసుకోవచ్చు.
కొబ్బరినూనెను ఆముదంతో కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. ఎందుకంటే వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఇది మొటిమలను నివారిస్తుంది.
వేసవి ఎండ నుండి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై సన్ టాన్ ఉంటే కొబ్బరినూనెలో ఆముదం కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకుంటే టాన్ తగ్గుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతుంది.
రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెలో ఆముదం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మంట తగ్గుతుంది. ఆముదం నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె కూడా మొటిమలను నివారిస్తుంది.