పుదీనా ఆకులను స్కిన్ సమస్యలకు నేచురల్ రెమెడీగా ఉపయోగిస్తారు. మొటిమల మచ్చలను తగ్గించడానికి పుదీనా ఉపయోగపడుతుంది. 

pexels

By Bandaru Satyaprasad
May 06, 2024

Hindustan Times
Telugu

మొటిమల మచ్చలకు కారణాలు- మొటిమలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. చివరకు మచ్చలను వదిలివేస్తాయి. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ నాన్-ఇన్‌ఫ్లమేటరీ రకాలు. మెటిమలను పిండడం వల్ల చర్మం చీలిపోయి, హాని కలిగిస్తుంది. చివరికి మచ్చలు ఏర్పడతాయి.  

pexels

పుదీనా ఆకుల్లోని సాలిసిలిక్ యాసిడ్ మొటిమలు, మచ్చలు చికిత్సకు సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.  ఫోలికల్స్‌ను అన్‌లాగ్ చేసి మచ్చలను తగ్గిస్తుంది.  

pexels

సాలిసిలిక్ యాసిడ్ కలిగి ఉన్న పుదీనా మొటిమల బారినపడే చర్మానికి చికిత్స చేయడానికి, మొటిమల మచ్చలు, ఇతర అనారోగ్యాలను తగ్గించడానికి ఆయుర్వేదంలో తరచుగా ఉపయోగిస్తారు.   

pexels

పుదీనాలో ఫాస్ఫేట్, కాల్షియం, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను పరిమితం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ చర్మ సమస్యలను చికిత్స చేయడంలో సహాయపడుతుంది.  

pexels

పుదీనా, పసుపు ప్యాక్ : 10-15 పుదీనా ఆకులు గ్రైండ్ చేసి, కొన్ని చుక్కల నీరు కలపండి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగండి.  

pexels

పుదీనా-నిమ్మరసం ప్యాక్, పుదీనా-ఓట్స్ ప్యాక్, పుదీనా- రోజ్ వాటర్ ప్యాక్, పుదీనా-దోసకాయ ప్యాక్ కూడా చేసుకోవచ్చు.  

pexels

పుదీనా ఫేస్ ప్యాక్‌లు సాధారణంగా సురక్షితమైనవి. అయితే కొన్ని పరిస్థితులలో కొందరికి అలెర్జీని కలిగిస్తుంది. ఈ ఫేస్ మాస్క్‌లను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. ముందు వైద్యుని సలహా తీసుకోండి.   

pexels

ఉదయాన్నే జీరా నీరు తాగారంటే అమృతం తాగినట్టే 

pixabay