Barley Soup Recipe : బార్లీతో ఆరోగ్యకరమైన హెల్తీ సూప్‌ను రెడీ చేసేయండి.. ఉదయాన్నే తాగేయండి..
Barley Soup Recipe : ఉదయాన్నే ఆరోగ్యకరమైన సూప్‌తో రోజును ప్రారంభించాలి అనుకుంటే.. మీరు కచ్చితంగా బార్లీ సూప్ తీసుకోండి. దీనిని తయారు చేయడం చాలా అంటే చాలా సింపుల్. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
Barley Soup Recipe : బార్లీ అనేది ఒక ఆరోగ్యకరమైన ధాన్యం. దీనితో మనం రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే ఎంత మంచిదైనా పిల్లలు దీనిని నేరుగా తీసుకోలేరు. కాబట్టి వారికోసం మీరు బార్లీతో సూప్ చేయవచ్చు. హెల్తీ, సింపుల్ రెసిపీ. దీనిని తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. వింటర్లో వచ్చే పలు జబ్బుల రాకుండా.. వచ్చినా వాటినుంచి ఉపశమనం అందిస్తాయి. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బార్లీ - 2 టేబుల్ స్పూన్ (2 గంటలు నానబెట్టాలి)
* ఎర్రని కందిపప్పు - 1 టేబుల్ స్పూన్ (30 నిమిషాలు నానబెట్టాలి)
* నూనె - 1 టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు - 2 (మెత్తగా తరిగినవి)
* పచ్చిమిర్చి - 1 (తరిగినది)
* ఉల్లిపాయ - 1 టీస్పూన్ (తరిగినవి)
* క్యారెట్ - 2 టేబుల్ స్పూన్స్
* బీన్స్ - 2 టేబుల్ స్పూన్స్
* క్యాలీఫ్లవర్ - 2 టీస్పూన్లు
* ఉప్పు - రుచికి తగినంత
* పసుపు - 1/2 tsp
* నీరు - 2-3 కప్పులు
* నెయ్యి -1 tsp
* మిరియాలపొడి - 1/2 tsp
బార్లీ సూప్ తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టి నూనె వేడి చేయాలి. దానిలో వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయాలి. వాటిని బాగా వేయించాలి. నానబెట్టిన బార్లీ, ఎర్రకందిపప్పును వేసి కలపాలి. అనంతరం మిగిలిన కూరగాయలను వేసి బాగా కలపాలి. మీడియం మంట మీద ఒక నిమిషం వేయించండి. దానిలో ఉప్పు, పసుపు వేసి కాసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు నీరు వేసి.. మూతపెట్టి ప్రెషర్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అనంతరం దీనిని ఒక గిన్నెలోకి మార్చండి. వేడి వేడిగా తాగేయండి.
సంబంధిత కథనం