Soya Pulao Recipe : నిమిషాల్లోనే హెల్తీ, టేస్టీ పులావ్.. ఎలా చేస్తారంటే..
Soya Pulao Recipe : నిమిషాల్లోనే మీరు టేస్టీ పులావ్ తినాలనుకుంటున్నారా? అయితే ఆర్డర్ కాదు.. ఇంట్లోనే తయారు చేసుకోండి. నిమిషాల్లో అయ్యే పులావ్ ఏంటి అనుకుంటున్నారా? అదే సోయా పులావ్. దీనిని తయారు చేయడం చాలా సులభం.
Soya Pulao Recipe : సోయా పులావ్ ఒక ఆరోగ్యకరమైన వంటకంగా చెప్పవచ్చు. దీనిని నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. సోయా చంక్స్‌లో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని మీరు మీ లంచ్ లేదా డిన్నర్ కోసం తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పండుగల సమయంలో నాన్ వెజ్ తినని వారు అయితే.. పండుగ వైబ్స్ పోకుండా దీనిని తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* సోయా - 1 కప్పు
* బియ్యం - 250 గ్రాములు
* పెరుగు - 1/2 కప్పు
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* ఉల్లిపాయ - 1 మీడియం తరిగినది
* టొమాటో - 1 మీడియం తరిగినది
* పచ్చి మిర్చి - 2
* ఏలకులు - 2-3
* మిరియాలు - 8-10
* లవంగాలు - 7-8
* కారం - 1 స్పూన్
* జీలకర్ర - 1 tsp
* పసుపు - 1/2 tsp
* చికెన్ మసాలా - 1 టీస్పూన్
* గరం మసాలా - 1/2 tsp
* ఆయిల్ - 3 tbsp
* ఉప్పు - రుచికి తగినంత
సోయా పులావ్ తయారీ విధానం
మొదట సోయాలను వేడి నీటిలో 15 నిమిషాలు నానబెట్టండి. అనంతరం వాటని నీటినుంచి బయటకు తీసి.. నీటిని పిండేయండి. ఇప్పుడు ఓ గిన్నెలో సోయా చంక్స్ తీసుకుని.. దానిలో పెరుగు, తాకం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి బాగా కలపండి. దానిని కాసేపు పక్కన పెట్టండి.
ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకుని స్టవ్ మీద ఉంచండి. దానిలో నూనె వేసి వేడిచేయండి. దానిలో మొత్తం మసాలా దినుసులు, కారం వేసి కొన్ని సెకన్ల పాటు వేయించండి. అనంతరం తరిగిన ఉల్లిపాయను వేసి వేయించండి. ఉల్లిపాయలు వేగాక.. మ్యారినేట్ చేసిన సోయా ముక్కలు వేసి కాసేపు వేయించాలి. అనంతరం దానిలో తరిగిన టమోటాలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. దానిలో నానబెట్టిన బియ్యం వేసి బాగా కలిపి తగినంత నీరు పోయండి. ఉప్పు వేసి బాగా కలపండి. అనంతరం ప్రెజర్ కుక్కర్‌లో కుక్ చేయండి. అంతే వేడి వేడి సోయా పులావ్ రెడీ. దీన్ని రైతా లేదా చట్నీతో లాగించేయవచ్చు.
సంబంధిత కథనం