Reduce Face Fat : ముఖంలోని కొవ్వును పోగొట్టాలా? ఇవి ఫాలో కావాల్సిందే-avoid these foods to reduce face fat in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Reduce Face Fat : ముఖంలోని కొవ్వును పోగొట్టాలా? ఇవి ఫాలో కావాల్సిందే

Reduce Face Fat : ముఖంలోని కొవ్వును పోగొట్టాలా? ఇవి ఫాలో కావాల్సిందే

HT Telugu Desk HT Telugu
Mar 27, 2023 02:40 PM IST

Reduce Face Fat : ఈ కాలంలో ప్రజలు నిత్యం జంక్ ఫుడ్ తినడం కామన్ అయిపోయింది. దీంతో బరువు పెరుగుతారు. కొవ్వు ఎక్కడ పడితే అక్కడ చేరి ఘోరంగా కనిపిస్తారు. కొందరిలో హార్మోన్ల సమస్యల వల్ల కూడా బరువు పెరగవచ్చు. ఈ అదనపు బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ముఖంపై కొవ్వు తగ్గించుకోండి
ముఖంపై కొవ్వు తగ్గించుకోండి

శరీరం బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఒకవైపు శరీర బరువు తగ్గినా.. ఒక్కోసారి మన ముఖంపై ఉన్న కొవ్వు(Face Fat) మాత్రం మాయం కాదు. అయ్యో.. ఇదేంటి నా ముఖం ఇలా తయారు అయింది అని బాధపడుతుంటారు. ముఖంలోని కొవ్వును పోగొట్టుకోవడానికి యోగా, వ్యాయామం వంటివి కూడా చేయాలి. అయితే మీరు అనుకున్నంత ఈజీగా ముఖంలోని కొవ్వు కరిగిపోదు. మీ ఆహార శైలిని మార్చుకోవాలి.

మీ రోజువారీ ఆహారంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే, ఖచ్చితంగా ముఖంలోని కొవ్వు త్వరగా మాయమవుతుంది. అయితే ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం. మీ రోజువారీ ఆహారంలో మార్పు కచ్చితంగా ముఖంలోని కొవ్వును కరిగిస్తుంది. అనేక ఆహారాలు(Food) మీ శరీరంలో ఊబకాయాన్ని కలిగిస్తాయి. అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. సోడియం, ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ముఖం ఉబ్బినట్టుగా అవుతుంది.

మీరు మద్యం(alcohol) మానేయాలి. ఎందుకంటే ఇది మీ ముఖం ఉబ్బుగా కనిపించడానికి మూల కారణం. ఆల్కహాల్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరిగేలా చేస్తుంది. ముఖం కూడా ఉబ్బుతుంది.

జంక్ ఫుడ్(Junk Food) రుచిగా ఉంటుంది కాబట్టి మనం తింటాం. జంక్ ఫుడ్ లేనిదే జీవితం లేదంటున్నారు జనాలు. కానీ ఇది శరీర ఆరోగ్యానికి(Body Health) చాలా ప్రమాదకరం. జంక్ ఫుడ్‌లో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు ముఖం కూడా వాచిపోతుంది. కాబట్టి జంక్ ఫుడ్ కు బై బై చెప్పాల్సిందే.

బరువు పెరగడానికి, ముఖం ఉబ్బినట్టుగా కనిపించడానికి రెడ్ మీట్‌(Red Meat)ల వినియోగం కూడా ఒక కారణం. అవి పశువులు, పంది, గొర్రెలు, మేక మొదలైనవి. వీటిలో ఉండే అధిక క్యాలరీల వల్ల మనిషి శరీర బరువును పెంచుతాయి. వాటిని తినకపోవడమే మంచిది. తినకుంటే మనసు ఊరుకోదు అనుకుంటే.. తక్కువగా తనిండి.

ఆహారంలో ఉప్పు(Salt) తక్కువగా తీసుకోవడం మంచిది. కొంతమంది వంటల్లో ఉప్పు ఎక్కువగా వాడుతుంటారు. మరికొందరు భోజనం మధ్యలో లేచి ఉప్పు తీసుకుని భోజనంలో కలుపుతారు. సోడియం బరువు పెరగడానికి, ముఖం ఉబ్బడనికి కారణమవుతుంది.

చాలా మంది అల్పాహారంగా బ్రెడ్(Bread For Breakfast) తింటారు. బ్రెడ్‌ను బ్రెడ్ టోస్ట్, శాండ్‌విచ్, బ్రెడ్ ఆమ్లెట్ ఇలా రకరకాలుగా తీసుకుంటారు. ఇది బరువు పెరగడానికి, ముఖం కొవ్వుకు దారితీస్తుంది. బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరం. ఇది శుద్ధి చేసిన చక్కెర లేదా శుద్ధి చేసిన నూనె మొదలైనవి కావచ్చు. వీటిని తీసుకోవడం వల్ల కచ్చితంగా ఫేషియల్ ఒబేసిటీ పెరుగుతుంది. పైన పేర్కొన్నవి మీ ఆహారానికి వీలైనంత దూరంగా ఉంచండి. ఈ ఆహారానికి బదులుగా, మీరు మీ డైట్ చార్ట్‌లో ఇతర ఆరోగ్యకరమైన ఫుడ్ చేర్చుకుంటే కొవ్వును తగ్గించవచ్చు.

WhatsApp channel