Bread Bonda Recipe : బ్రేక్‌ఫాస్ట్‌లోకి బ్రెడ్ బొండా.. తింటే మళ్లీ కావాలంటారు!-breakfast recipes taste bread bonda in your breakfast here s making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakfast Recipes Taste Bread Bonda In Your Breakfast Here's Making Process

Bread Bonda Recipe : బ్రేక్‌ఫాస్ట్‌లోకి బ్రెడ్ బొండా.. తింటే మళ్లీ కావాలంటారు!

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 06:30 AM IST

Bread Bonda Recipe : బ్రేక్‌ఫాస్ట్‌లోకి రోజూ ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే కొత్తగా ట్రై చేయండి. బ్రెడ్ బొండాను తయారు చేసుకోండి.

బ్రెడ్ బొండా
బ్రెడ్ బొండా

బొండాలను బ్రేక్ ఫాస్ట్ లో కొంతమంది తీంటారు. మైదా, గోధుమ పిండితో వీటిని తయారు చేస్తారు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి చేసుకుంటారు. మైదా, గొధుమ కాకుండా కూడా బొండాలను తయారు చేసుకోవచ్చు. అవే బ్రెడ్ బొండాలు. తినేందుకు ఇవి కూడా టెస్టీగా ఉంటాయి. బ్రెడ్ తో చేసే బొండాలను ఇష్టంగా తింటారు. వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లోకి తినొచ్చు. లేదంటే.. సాయంత్ర స్నాక్స్ లాగా కూడా లాగించేయోచ్చు. బ్రెడ్ బొండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

తయారీకి కావాల్సినవి

బ్రెడ్ ముక్కలు-12, ఆలుగ‌డ్డలు-మూడు, ఉల్లిపాయ-ఒక‌టి, నాన‌బెట్టిన శ‌న‌గ‌లు-కొన్ని తీసుకోవాలి, కొత్తిమీర త‌రుగు-2 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర-ఒక టీస్పూన్‌, కారం-ఒక టీస్పూన్‌, గ‌రం మ‌సాలా-అర టీస్పూన్‌, ప‌సుపు-పావు టీస్పూన్‌, ఉప్పు-కావాల్సినంత, నూనె-వేయించుకోడానికి సరిపడా.

తయారీ విధానం

మెుదట శనగలు, బంగాళా దుంపలను ఉడికించుకోవాలి. ఆ తర్వాత బంగాళా దంపుల పొట్టు తీసుకోవాలి. స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని.., నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళా దంపుల ముక్కలు, శనగలను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా, కావాల్సినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమం కూరలాగా తయారు అవుతుుంది. ఆ తర్వాత కొత్తి మీర వేసి దింపేయాలి. ఈ మిశ్రమం చల్లగా అయ్యేవరకూ వెయిట్ చేయాలి. అనంతరం చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ను తీసుకోవాలి. వాటి అంచులను తీసి వేయాలి. ఇప్పుడు నీళ్లలో ఒక్కసారి ముంచి తీసి.., అందులో బంగాళ దుంప ఉండను పెట్టుకోవాలి. ఆ తర్వాత అంచులు మూస్తూ బొండాలా చేసుకుంటే అయిపోతుంది. ఇలా అన్నీ చేసుకుని.. మూడు నాలుగు చొప్పున కాగుతున్న నూనెలో వేయాలి. ఎర్రగా అయ్యేవరకూ ఉంచాలి. అంతే టెస్టీ టెస్టీ బ్రెడ్ బొండా రెడీ. వేడి వేడిగా పల్లి చట్నీతో కలిపి తింటే.. ఆహా అంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం