Deodorant Smell: డియోడరెంట్ వాసన చూసి మైమరచిపోతున్నారా? భవిష్యత్తులో అదే ప్రాణాంతకంగా మారే అవకాశం-are you mesmerized by the smell of deodorant the possibility of the same becoming fatal in future ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Deodorant Smell: డియోడరెంట్ వాసన చూసి మైమరచిపోతున్నారా? భవిష్యత్తులో అదే ప్రాణాంతకంగా మారే అవకాశం

Deodorant Smell: డియోడరెంట్ వాసన చూసి మైమరచిపోతున్నారా? భవిష్యత్తులో అదే ప్రాణాంతకంగా మారే అవకాశం

Haritha Chappa HT Telugu
Sep 05, 2024 07:00 PM IST

Deodorant Smell: మీరు రోజూ డియోడరెంట్ ను అప్లై చేసుకుంటారా? దాని వాసనకు మైమరచి పోతారు. నిజానికి ఆ వాసన బావున్నా కూడా అది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచేస్తుంది. డియోడరెంట్ వాసన ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసుకోండి.

డియోడరెంట్ వాసనతో ప్రమాదమా?
డియోడరెంట్ వాసనతో ప్రమాదమా? (shutterstock)

డియోడరెంట్‌ను ప్రతిరోజూ అప్లై చేసుకునేవారి సంఖ్య చాలా ఎక్కువ. దాన్ని కూడా నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చేస్తారు. సబ్బులు, షాంపూలు, నూనెలు, క్రీములు కొన్నప్పుడే డియోడరెంట్ కూడా ఆ జాబితాలో చేర్చి కొంటారు. ఆఫీసుకు వెళుతున్నప్పుడు పెర్ఫ్యూమ్ కొట్టుకునే బయటికి వెళతారు. ప్రతి నెలా రకరకాల ఘాటైన వాసనలు వేసే డియోడరెంట్లను వాడే వారే ఎక్కువ. కానీ ఈ డియోడరెంట్ వాసన ఆరోగ్యానికి మాత్రం చాలా చేటు చేస్తుంది.

డియోడరెంట్ నుంచి వచ్చే మంచి వాసన మీ ఆరోగ్యంతో చెలగాటమాడుతుంది. డియోడరెంట్ అధికంగా పీల్చడం వల్ల గతేడాది ఒక బాలిక మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఎందుకంటే డియోడరెంట్ వాసన గుండెకు ఎంతో ప్రమాదకరం.

మనలో కొంతమంది పెర్ఫ్యూమ్, డియోడరెంట్ వాసనను తట్టుకోలేరు. వాసన చూసిన వెంటనే, తలనొప్పి రావడం, మైకము, వికారం వంటి అనుభూతి ప్రారంభమవుతుంది. ఈ డియోడరెంట్స్ లో ఉండే హానికారక రసాయనాలు గాలిలో కరిగి శ్వాస ద్వారా ఊపిరితిత్తులకు చేరి ప్రతిస్పందిస్తాయి. అటువంటి పరిస్థితిలో మానసిక ఆందోళన, చంచలత వంటి సమస్యలు వస్తాయి.

డియోడరెంట్ వాసనతో గుండెపోటు

అమెరికాలో 14 ఏళ్ల బాలిక డియోడరెంట్ పీల్చి గుండెపోటుతో మృతి చెందింది. అప్పట్లో అక్కడ డియోడరెంట్ అంటే భయపడ్డారు. వాస్తవానికి, డియోడరెంట్స్ వంటి స్ప్రే బాటిళ్లలో బ్యూటేన్ వాయువు ఉంటుంది. వాసన రావడం వల్ల గుండె పనిచేయడం మానేసి గుండెపోటు వస్తుంది. స్ప్రే బాటిళ్లలో అనేక ఉత్పత్తుల్లో బ్యూటేన్ ఉపయోగిస్తాయి. ఇది ఒక రకమైన హైడ్రోకార్బన్ వాయువు, ఇది వాసన వ్యాప్తి చెందేలా చేస్తుంది. డియోడరెంట్ పై ఒత్తిడి వేసినప్పుడు, బ్యూటేన్ సహాయంతో వాసన బయటకు వస్తుంది. కానీ ఈ వాయువు చాలా ప్రమాదకరమైనది. గుండెకు హాని కలిగిస్తుంది.

నిజానికి డియోడరెంట్ బాటిల్ లో ఉండే గ్యాస్ బ్యూటేన్ హఠాత్తుగా ప్రాణాలు తీసేస్తోంది. అకస్మాత్తుగా స్నిఫ్ చేస్తే, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు. ఈ వాసన ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి వేగంగా శోషణకు గురవుతుంది. కొవ్వు కరిగి మెదడులోని నరాలపై ప్రభావం చూపుతుంది. గుండె పంపింగ్ చేయడం కూడా ఆపివేస్తుంది.

శరీరంపై నిరంతరం డియోడరెంట్ అప్లై చేయడం వల్ల ఎంతో హాని దాగి ఉంది. డియోడరెంట్ పీల్చిన వెంటనే మీకు కొన్ని లక్షణాలు కనిపిస్తే మీకు ఆ వాసన పడడం లేదని అర్థం. తలలో తీవ్రమైన నొప్పి, సైనసైటిస్, గందరగోళం, మైకము, దగ్గు, డిప్రెషన్, చెవిలో ఈలల శబ్దం వంటి లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే డియోడరెంట్ వాసన పీల్చడం మానేయాలి.

రసాయనాలు కలిసిన డియోడరెంట్లు వాడడం వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అల్యూమినియం, పారబెన్లు వంటివి అందులో ఉండే అవకాశం ఉంది. అల్యూమినియం వల్ల రొమ్ము క్యాన్సర్ రావొచ్చనే అధ్యయనాలు ఉన్నాయి. పారాబెన్లు మీలోని హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతాయి. ఉన్నంతలో సేంద్రీయ పద్ధతిలో తయారుచేసిన డియోడరెంట్లు లభిస్తాయో శోధించండి.

Whats_app_banner