Sinusitis causes symptoms: సైనసైటిస్‌‌తో బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో రిలీఫ్-know sinusitis causes symptoms and tips to keep sinus healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Sinusitis Causes Symptoms And Tips To Keep Sinus Healthy

Sinusitis causes symptoms: సైనసైటిస్‌‌తో బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో రిలీఫ్

HT Telugu Desk HT Telugu
Dec 19, 2022 12:10 PM IST

Sinusitis causes symptoms: చలికాలంలో సైనసైటిస్ తెచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. ఏ పనీ చేయలేనంతగా ఇబ్బంది పెడుతుంది. సైనస్ కారణాలు, లక్షణాలు, దీని నుంచి ఉపశమనం పొందేందుకు టిప్స్ తెలుసుకుందాం.

ఏ పనిపైనా ఏకాగ్రత నిలపకుండా చేసే సైనసైటిస్
ఏ పనిపైనా ఏకాగ్రత నిలపకుండా చేసే సైనసైటిస్ (Karolina Grabowska)

ఈఎన్‌టీ ఓపీడీకి వచ్చే పేషెంట్లలో ఎక్కువ మంది తమకు సైనస్ ఉందని చెబుతుంటారు. నిజానికి సైనస్ అంటే మన ముక్కులో ఉండే ఒక నిర్మాణం. అన్ని జీవరాశుల్లోనూ ఇది ఉంటుంది. సైనస్ మన పుర్రెలో గాలితో నిండిన ఒక శూన్య ప్రదేశం. ఆస్టియా అనే చిన్న ప్రవేశ మార్గాలు కలిగి ఉంటుంది. ఈ శూన్య ప్రదేశమే బ్లాక్ అయితే ఇన్‌ఫెక్షన్‌లా మారడమో లేక ఇన్‌ఫ్లమేషన్‌కు గురికావడమో అవుతుంది. దీనినే సైనసైటిస్ అంటారని

Symptoms of Sinusitis: సైనసైటిస్ లక్షణాలు

మ్యూకస్ అందులోని చిక్కుకుపోతుంది. సైనస్‌లోపలి భాగంలో ఒత్తిడి పెంచుతుంది. ఇది నొప్పికి కారణమవుతుంది. చాలా మంది సైనసైటిస్ పేషెంట్లు తలనొప్పితో బాధపడుతున్నట్టు చెబుతారు. సైనస్‌లో బ్లాక్ అయిన ప్రదేశాన్ని బట్టి నొప్పి ప్రాంతం మారుతుంటుంది. ఉదాహరణకు కనుబొమ్మల వద్ద నొప్పి ఉంటే అది ఫ్రంటల్ సైనసైటిస్ అని, దవడ ఎముకల వద్ద నొప్పిగా ఉంటే అది మాగ్జిలరీ సైనసైటిస్ అని, తల మధ్యలో లేదా వెనకవైపు నొప్పిగా ఉంటే స్పెనాయిడ్ సైనసైటిస్ అని అంటారు. కళ్ల చుట్టూ నొప్పిగా ఉంటే అది ఎథ్మాయిడ్ సైనసైటిస్ అవుతుంది. ముఖం, తల నిండుగా ఉండడం, తల తిప్పినట్టు అనిపించడం, కిందికి వంగినప్పుడు బరువుగా, మరింత నొప్పిగా అనిపించడం, కఫం గొంతు వెనకభాగంలోకి రావడం కనిపిస్తాయి. అలాగే తరచుగా జలుబు చేయడం, దుర్వాసన రావడం, రక్తంతో కూడిన చీమిడి రావడం, నిరంతరం ముక్కు బ్లాక్ అయి ఉండడం ఇతర లక్షణాలు.

Need to understand cause: సైనసైటిస్ కారణాలు

సైనసైటిస్‌కు గల కారణాలు గుర్తించి వాటిని అర్థం చేసుకోవాలి. అప్పుడే వాటికి సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. సైనసైటిస్ సాధారణంగా జలుబు వల్ల రావొచ్చు. ముక్కులో ట్యూమర్ వల్ల, ఫంగస్ వల్ల కూడా రావొచ్చు. ఇక అలర్జీ ఉన్న వ్యక్తులు తరచుగా ముక్కు కారడం, ముక్కు బ్లాక్ కావడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. వీటికి ముక్కు, గొంతు దురదగా ఉండడం కూడా కనిపిస్తుంది.

Fungal Sinusitis: ఫంగల్ సైనసైటిస్

ఫంగల్ సైనసైటిస్ కూడా సాధారణమైనదే. ఇది తేలికపాటి సైనస్ లక్షణాలతో లేదా ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్లతో ఉండొచ్చు. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో (ఉదాహరణకు మధుమేహం ఉన్నవారు, అవయవ మార్పిడి తర్వాత కేసులు మొదలైనవి), అలాగే ఇటీవలి కోవిడ్ కాలంలో ఇన్వేసివ్ ఫంగల్ సైనసిటిస్ కేసుల ఆకస్మిక పెరుగుదల కనిపించింది. చాలా మంది రోగులకు ముక్కు, సైనస్‌లలో నాసికా పాలిప్స్ ఏర్పడుతుంటాయి. ఇది సైనసిటిస్‌కు దారితీస్తుంది. ముక్కు, సైనస్‌లలో కణితులు కూడా అసాధారణమేమీ కాదు. కాబట్టి ఎవరికైనా దీర్ఘకాలం సైనసైటిస్ లక్షణాలు ఉంటే, ముఖ్యంగా రక్తంతో కూడిన చీమిడి కనిపించినప్పుడు వైద్యనిపుణులను సంప్రదించాలి.

Allergic and chronic Sinusitis: అలర్జీ, దీర్ఘకాలిక సైనసైటిస్

మెడికల్ థెరపీ ద్వారా అలర్జీతో కూడిన సైనసైటిస్, దీర్ఘకాలిక సైనసైటిస్‌ను నయం చేయవచ్చు. అయితే చాలాసార్లు సైనస్ సర్జరీ అవసరం అవ్వొచ్చు. సైనస్ సర్జరీ (ఎఫ్‌ఈఎస్ఎస్: ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ) అనేక అనేక సైనస్ సమస్యలకు చికిత్సగా నిరూపితమైంది. అయితే సైనసైటిస్‌ను త్వరగా గుర్తించగలిగితే సైనస్ సర్జరీ అవసరం రాదు.

TIPS to keep sinuses healthy: సైనస్ ఆరోగ్యంగా ఉండాలంటే టిప్స్ ఇవీ

  1. స్మోకింగ్ మానేయండి. అది సైనస్ క్లియర్‌గా ఉంచే వ్యవస్థను స్మోకింగ్ పాడుచేస్తుంది.
  2. క్రమం తప్పకుండా ఆవిరి పట్టండి. మరీ ముఖ్యంగా ముక్కు బ్లాక్ అయినప్పుడు చీమిడి మందంగా వచ్చినప్పుడు అవసరం.
  3. జల్-నేతి ప్రక్రియ చాలా పురాతనమైన ప్రక్రియ. సైనస్ సమస్యలను ఇది దూరం చేస్తుంది.
  4. నాలుగు వారాల కంటే ఎక్కువగా సైనసైటిస్ లక్షణాలు కనిపిస్తే ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించాలి. అలాగే ముక్కు నుంచి రక్తం పడినా, కనుల చుట్టూ నొప్పి కనిపించినా, కళ్లు ఉబ్బినట్టు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి.
  5. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే డయాబెటిక్, క్యాన్సర్, హెచ్‌ఐవీ పేషెంట్లు, అవయవ మార్పిడి చేసుకున్న వారు కూడా వైద్య నిపుణులను సంప్రదించాలి.

WhatsApp channel

టాపిక్