Air Conditioner in Summer । వేసవిలో ఏసీకి సరైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? విద్యుత్ ఆదా ఎలా చేయొచ్చు?!-air conditioner in summer know ideal temperature for ac in india cool tips reduce bill ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Air Conditioner In Summer । వేసవిలో ఏసీకి సరైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? విద్యుత్ ఆదా ఎలా చేయొచ్చు?!

Air Conditioner in Summer । వేసవిలో ఏసీకి సరైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? విద్యుత్ ఆదా ఎలా చేయొచ్చు?!

HT Telugu Desk HT Telugu
Apr 18, 2023 12:01 PM IST

Air Conditioner in Summer: వేసవిలో ఎయిర్ కండిషనింగ్‌ ఉపయోగిస్తే అది ఎంత సమయం పాటు ఉపయోగించాలి, ఏసీ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

Air Conditioner in Summer:
Air Conditioner in Summer: (Unsplash )

Air Conditioner in Summer: వేసవికాలంలో భారతదేశంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఈ వేసవి తాపాన్ని ఎవరు భరించగలరు? గదిలో చల్లదనం లేనిదే ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు. ఎండవేడిని తట్టుకునేందుకు చాలా మంది ఏసీలు, కూలర్లు (Air Coolers) బిగించుకుంటారు. ఇటీవల కాలంలో ఏసీల వినియోగం బాగా పెరిగింది. కొంతమంది 24 గంటలూ ఏసీలోనే ఉంటారు. ఏసీ ఉష్ణోగ్రతలను కనిష్టానికి తగ్గించి సేదతీరుతారు. అయితే నిరంతరం ఏసీలో ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, అంతేకాకుండా ఇది మీ కరెంట్ బిల్లులను పెంచడంతో పాటు, వాతావారణంలోనూ వేడిని పెంచుతుంది. అవసరానికి తగినట్లుగా ఏసి ఉష్ణోగ్రతలు సర్దుబాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ వేసవిలో ఎయిర్ కండిషనింగ్‌ ఉపయోగిస్తే అది ఎంత సమయం పాటు ఉపయోగించాలి, ఏసీ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి, నిద్రించటానికి అనువైన ఉష్ణోగ్రత ఏది? తదితర అంశాలపై నిపుణులు కొన్ని చిట్కాలు (Air Conditioning Tips) అందించారు. అది ఇక్కడ తెలుసుకోండి.

Ideal Temperature For AC- ఏసీకి అనువైన ఉష్ణోగ్రత ఎంత?

భారత వాతావరణ పరిస్థితులకు ఏసీకి అనువైన ఉష్ణోగ్రత 26-28 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉండాలి. ఇది మీ గదిని చల్లబరచటమే (Cooling) కాకుండా మీరు సౌకర్యంగా నిద్రపోవడానికి గదిలో అనువైన వాతావరణంను కల్పిస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కూడా ఆదా అవుతుంది. మీకు మరింత కూలింగా కావాలనుకుంటే 24 డిగ్రీ సెల్సియస్ వద్ద అతి తక్కువ వేగంతో ఫ్యాన్‌ని కూడా ఆన్ చేయవచ్చు. ఇలా మీరు సంతృప్తికరమైన చల్లదనంను ఆస్వాదించవచ్చు.

24/7 Air Conditioning- గంటలు ACని నడపవచ్చా?

బయట చాలా వేడిగా ఉన్నప్పుడు, చల్లదనం మీరు రోజంతా మీ ACని రన్ చేయడం ఒక్కటే మార్గం. అయితే, బయటి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కూడా AC అలాగే పనిచేస్తూ ఉంటే, ప్రయోజనం లేదు. ఒకవేళ బయట వేడి తక్కువ ఉన్నప్పుడు కూడా మీ AC త్వరగా చల్లబరచకపోతే అది ఆ ACలోనే ఏదైనా లోపం ఉన్నట్లు లేదా మీ గది విస్తీర్ణం దాని సామర్థ్యానికి మించి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

How Many Hours AC Should Run Per Day- ఏసీ రోజుకు ఎన్ని గంటలు నడపాలి?

బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, మీ ACని రోజులో 24 గంటలూ కొనసాగించవచ్చు. అయితే, ఎండ ఎక్కువ లేనపుడు వాతావరణం సాధారణంగా ఉన్నప్పుడు ప్రతీ గంటకు రెండు సార్లు 12-15 నిమిషాల వ్యవధిలో ఎయిర్ కాన్ పని చేయిస్తే సరిపోతుంది.

Energy Saving AC Temperature- శక్తి ఆదా కోసం ఉత్తమ AC ఉష్ణోగ్రత ఏది?

AC సిస్టమ్ ఎంత కష్టపడి పనిచేస్తే, అది ఆంత ఎక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తుంది, దాని బిల్లు వచ్చినప్పుడు మీకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. అయితే ప్రస్తుతం ఏసీలు అధునాతన ఫీచర్లతో ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్‌లతో వస్తున్నాయి. పూర్తిగా కూలింగ్ మోడ్, గదిలో మీరు లేనప్పుడు అవే మోడ్, నిద్రిస్తున్నప్పుడు స్లీప్ టైమ్ మోడ్ వంటి ఫీచర్లను డిఫాల్ట్‌గా కలిగి ఉంటున్నాయి. ఇవి ఉదయం పూట ఒకలా, పగటి పూట ఒకలా, నిద్రించే సమయంలో మరోలా వాటంతటవే ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకుంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్