వేసవి వేడి ఎక్కువైంది. సూరీడు చెమటలు పట్టించేస్తున్నాడు. ఇది తట్టుకోలేక.. చాలా మంది ఎయిర్ కూలర్లు(Air Cooler), ఏసీ(Air conditioner)లు కొనేందుకు చూస్తున్నారు. ఓ వైపు ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. మరోవైపు.. ఉపశమనం కోసం కూలర్, ఏసీని కొనాలని ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఏది కొంటే బెటర్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏసీ నుంచి వచ్చే గాలి మంచిదా? ఎయిర్ కూలర్ నుంచి వచ్చే గాలి మంచిదా?
ఎయిర్ కండిషనర్లు Vs ఎయిర్ కూలర్‌ల గురించి చర్చలో జరుగుతూనే ఉంది. మీరు ఎయిర్ కూలర్(Air Cooler)ను ఎందుకు ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. కూలర్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేడి, పొడి వాతావరణంలో నివసించే వ్యక్తులకు ఇది ముఖ్యమైపోయింది. అవసరాలను బట్టి డెజర్ట్ కూలర్, విండో కూలర్, వ్యక్తిగత కూలర్ నుండి కూడా కొనుక్కోవచ్చు.
ఎయిర్ కండీషనర్ గది అంతర్గత గాలిని పదే పదే ప్రసారం చేస్తుంది. అంటే మీ ఇంట్లో ఉండే గాలినే చల్లగా చేసి మళ్లీ పంపిస్తుంది. అయితే ఎయిర్ కూలర్ బయటి నుండి తాజా గాలి(Air)ని లాగి, ఆపై చల్లబరుస్తుంది. ఎయిర్ కూలర్.. ఎయిర్ కండీషనర్ లాగా గాలిని పొడిగా చేయదు. ఇది పనిచేసే విధానం కారణంగా ఎయిర్ కూలర్ మీ గదికి మెరుగైన నాణ్యమైన గాలిని అందిస్తుంది. ఆస్తమా లేదా డస్ట్ అలర్జీ ఉన్నవారికి ఎయిర్ కూలర్ నుండి వచ్చే గాలి ఉత్తమం.
కూలర్లలో గాలి చల్లగా చేసేందుకు నీళ్లు(Water) కూడా కావాలి. ఆస్తమా డస్ట్ ఎలర్జీ మొదలైన సమస్యలతో బాధపడేవారికి కూలర్ గాలే మంచిది. ఏసీ గాలి కంటే కూలర్ గాలి స్వచ్ఛంగా ఉంటుంది. కూలర్ ని కొనుగోలు చేయడమే బెటర్. ఏసీలో ఉండే క్లోరోఫ్లోరో కార్బన్.. హైడ్రోక్లోరో క్లోరో ఫ్లోరా కార్బన్ పర్యావరణానికి కూడా హాని కలిగిస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలతో(Breathing Problems) బాధపడేవారికి ఈ గాలి ప్రమాదకరం.
డబ్బు విలువ విషయానికి వస్తే, ఎయిర్ కూలర్ కచ్చితంగా ఏసీ కంటే తక్కువ ధరే ఉంటుంది. ఏసీ ధర రూ.30,000 నుండి రూ.60,000 వరకు ఉండొచ్చు. అంతకుమించినవి కూడా ఉంటాయి. అయితే కూలర్ రూ.3000 నుండి రూ.15,000 వరకు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ కూలర్ నిర్వహణ ఖర్చు కూడా ఏసీ కంటే తక్కువే ఉంటుంది. విద్యుత్ బిల్లు(Power Bill) ఆదా చేయోచ్చు.
ఎయిర్ కూలర్(Air Cooler) నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఎయిర్ కండీషనర్ (AC)ని అమర్చడం అందరికీ సాధ్యం కాదు. ఇది ఖరీదైనది. దిగువ, మధ్య తరగతి వారికి ఇది ఒక కల. అందుకే మీరు ఎయిర్ కూలర్‌ను ఎంచుకోవచ్చు. ఇది బడ్జెట్‌కు అనుకూలమైనది. వేసవి వేడి నుంచి చల్లగా ఉండొచ్చు.
వేసవి(Summer)లో ఇంటికి ఎయిర్ కూలర్ ఉత్తమ ఎంపిక. ఇది ఇంటి లోపల, ఆరుబయట ఉంచవచ్చు. దీని నిర్వహణ కూడా సులభం. వాటర్ కూల్డ్ కూలర్లు తాజా, చల్లని గాలిని అందిస్తాయి. పర్యావరణ అనుకూలమైనవి కూడా. పైన చెప్పిన వివరాల ఆధారంగా ఏది కొంటే మంచిదో మీరే డిసైట్ చేసుకోండి.