Adventure sports: మీ ధైర్యానికి పరీక్షపెట్టే సాహసక్రీడలు.. మన దేశంలో ఎక్కడెక్కడున్నాయంటే
Adventure sports: సాహస క్రీడలు ఉత్తేజకరమైనవి. థ్రిల్లింగ్ అనుభూతి కోసం వీటిని జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించాల్సిందే. మన దేశంలో రకరకాల సాహసక్రీడలు ప్రయత్నించడానికి అత్యుత్తమ ప్రదేశాలు ఎక్కడున్నాయో తెల్సుకోండి.
అంతులేని పరిచయం, ఏకతాటి నిరంతర ప్రవాహంతో కూడిన లౌకిక జీవితపు హడావుడి అంతా. సాధారణ, రోజువారీ దినచర్య చక్రం కింద, పక్కటెముకలో ఉరుమును అనుభవించడానికి మరియు జీవితంలోని అన్ని నెమ్మదిగా సాగే వేగం నుండి విచ్ఛిన్నం కావాలనే ఉత్సాహభరిత కోరిక దాగి ఉంది. ప్రయాణం అనేది ఇతరులకు విశ్రాంతినిచ్చే క్షణం అయితే, కొంతమందికి జీవించడానికి మరియు ఆడ్రినలిన్ అధికంగా ఉండటానికి ఇది సమయం. విసుగు యొక్క పరిమితుల నుండి బయటపడటానికి మరియు తెలియని థ్రిల్ను స్వీకరించడానికి ఆరాటపడేవారికి, ఈ సాహస క్రీడలను ప్రయత్నించండి:
పారాగ్లైడింగ్:
ఇది ఒక విపరీత సాహస క్రీడ. దీంట్లో మీరు ఆకాశంలో విహరిస్తారు. విశాలమైన ప్రకృతి దృశ్యాలు, ఆకాశమార్గాలను ఆస్వాదిస్తారు. ఆ ఎత్తులో ప్రతిదీ సూక్ష్మంగా కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న బీర్ బిల్లింగ్ భారతదేశంలో పారాగ్లైడింగ్ ప్రయత్నించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ, హిమాలయాల దిగువన ఉన్న అడవి పచ్చదనం ఏదో వేరేలోకంలో ఉన్నమా అనేట్టు దృశ్యాలను మన కళ్ల ముందుంచుతుంది. ఆ అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.
బంగీ జంపింగ్:
రిషికేష్ లోని మోహన్ చట్టి విలేజ్ సమీపంలో ఉన్న ఈ ప్రదేశంలో 83 మీటర్ల ఎత్తులో భారతదేశపు ఎత్తైన బంగీ జంపింగ్ స్పాట్ కనిపిస్తుంది. మీ ధైర్యం మీద నమ్మకం ఉంచి నడుముకు కేవలం తాడకట్టి లోయలోకి దూకడమే బంగీ జంపింగ్. గురుత్వాకర్షణ శక్తి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అనుభూతి వస్తుందిక్కడ. గట్టిగా అరుస్తూ కేకలతో మీ భయాన్ని, ఆనందాన్ని బయటపెట్టేస్తారు.
స్కూబా డైవింగ్:
నీటి అడుగున ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి, సముద్ర జీవులతో కలిసి ప్రయాణించడానికి స్కూబా డైవింగ్ మంచి సాహస క్రీడే. పగడపు దీవులు, నీటి అడుగున ఉన్న అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఇది నిజంగా అబద్దమేమో అనిపిస్తుంది. ఏదో వేరొక గ్రహంపై ఉన్నట్లుగా అనిపిస్తుంది. స్కూబా గేర్ తో మీరు హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు. సముద్ర జీవులను దగ్గరగా చూడగలరు. అండమాన్ నికోబార్ దీవులలోని హావ్‌లాక్ ద్వీపం సాహసాన్వేషకులకు స్కూబా డైవింగ్ చేయడానికి ఉత్తమ ప్రదేశం.
స్కై డైవింగ్:
స్కై డైవింగ్ లో గాలిలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోతారు. భూమి వైపు పడ్డప్పుడు ఒక్కసారి ఏమవుతుందో అర్థం కాదు. మీ శరీరం తేలికగా అనిపిస్తుంది. ఈ సాహస క్రీడ చేయాలంటే గట్టి గుండె కావాలి. మహారాష్ట్రలోని ఆంబీ వ్యాలీ స్కైడైవింగ్ కు అనువైన ప్రదేశాల్లో ఒకటి. పైనుంచి కనిపించే లోనావాలా దృశ్యాలు మంత్రముగ్ధులను చేస్తాయి.
కయాకింగ్:
ఇదొక నీటి క్రీడ. చిన్న ఇరుకుగా ఉండే పడవలో నీళ్ల మీద ప్రయాణిస్తారు. మీ ధైర్యం బట్టి మీరు నీటిలో విహరించే ప్రదేశం ఎంచుకోవచ్చు. జలాల ప్రవాహం సాధారణంగా ఉంటే నిజానికి ఈ క్రీడ వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది. రిషికేష్ గంగా నదీ జలాలు ఈ క్రీడకు మంచి ప్రదేశం.
టాపిక్