Women diving with saree : ఆడవాళ్లు.. మీకు జోహార్లు- చీర కట్టులో డైవింగ్​ చేస్తున్న మహిళలు!-viral video shows tamil nadu women wearing sarees diving into thamirabarani river ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Women Diving With Saree : ఆడవాళ్లు.. మీకు జోహార్లు- చీర కట్టులో డైవింగ్​ చేస్తున్న మహిళలు!

Women diving with saree : ఆడవాళ్లు.. మీకు జోహార్లు- చీర కట్టులో డైవింగ్​ చేస్తున్న మహిళలు!

Sharath Chitturi HT Telugu
Feb 07, 2023 11:54 AM IST

Women wearing saree diving into river : తమిళనాడుకు చెందిన కొందరు మహిళలు చీరలో డైవింగ్​ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అలా చేయడం వారికి అలవాటేనని తెలుస్తోంది.

చీరలో నదిలోకి దూకేస్తున్న మహిళ
చీరలో నదిలోకి దూకేస్తున్న మహిళ (Screenshot)

Women wearing saree diving into river : చెరువు, నదిలో ఈత కొట్టడం చాలా మందికి సరదా! ముఖ్యంగా చిన్న పిల్లలు స్విమ్మింగ్​తో పాటు డైవింగ్​ కూడా చేస్తూ ఉంటారు. అయితే.. ఎప్పుడైనా మహిళలు డైవ్​ చేయడం చూశారా? అది కూడా చీర కట్టులో! అవును మీరు విన్నది నిజమే. తమిళనాడుకు చెందిన కొందరు మహిళలు.. చీరలో డైవింగ్​ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వివరాల్లోకి వెళితే..

చిరలో డైవింగ్​.. అలవాటే!

ఐఏఎస్​ అధికారి సుప్రియ సాహూ.. ఈ వీడియో షేర్​ చేశారు. ఈ వీడియోను తమిళనాడుకు చెందిన థమిరబరణి నది వద్ద తీశారు. వీడియో నిడివి 20 సెకన్లు. కొందరు మహిళలు చాలా ధైర్యంగా నదిలోకి డైవ్​ చేస్తుండటం వీడియోలో ఉంది. అది కూడా చీర కట్టులో!

Tamil Nadu women diving viral video : "ఈ వీడియో చూసి విస్మయానికి గురయ్యాను. చీర కట్టుకున్న మహిళలు.. చాలా సులభంగా నదిలోకి డైవ్​ చేస్తున్నారు. కల్లిదైకురిచిలో తీసింది ఈ వీడియో. ఇదంతా వారికి సర్వ సాధారణమైన విషయమే అట," అని సుప్రియ సాహూ రాసుకొచ్చారు.

వీడియోలో కనిపిస్తున్న మహిళలు.. తరచూ అలా చీరలో డైవ్​ చేస్తూ ఉంటారని సమచారం. వారికి అది ఎప్పటి నుంచో అలవాటైన విషయమే అని తెలుస్తోంది.

నెట్టింట మిశ్రమ స్పందన..

Women wearing saree diving video : సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే 50వేలకుపైగా వ్యూస్​ వచ్చాయి. వీడియో చూసిన కొందరు 'వావ్​' అంటుంటే.. మరికొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

"గ్రామాల్లో బావులు ఉంటాయి. వాటి పై నుంచి పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు దూకడం గ్రామాల్లో సాధారణమైన విషయం. ఈ మహిళలు డైవింగ్​ కళలో నైపుణ్యం పొందినట్టున్నారు," అని ఓ నెటిజెన్​ రాసుకొచ్చారు.

కాగా.. కొందరు మహిళల భద్రత, నది పరిరక్షణపై సందేహాలు వ్యక్తం చేశారు.

Tamil Nadu viral video : "థమిరబరణి చాలా స్వచ్ఛమైన నది. అనవసరమైన కాలుష్యానికి ఈ నది గురి కాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. దేశంలోని చాలా నదుల్లో ఇదే జరుగుతోంది. ఇక్కడ ఇలా జరగకుండా చూసుకోవాలి," అని ఓ వ్యక్తి కామెంట్​ చేశారు. మరో నెటిజన్​.."దేశంలోని మహిళలకు.. తమిళనాడు అత్యంత భద్రతమైన ప్రాంతంగా కనిపిస్తోంది. వావ్​," అని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :

సంబంధిత కథనం