Aadi Swaroopa writing : ప్రపంచంలో చాలా మందికి ఒక చేత్తో రాసే అలవాటు ఉంటుంది. కానీ కొందరికి మాత్రం రెండు చేతులతో రాసే సామర్థ్యం ఉంటుంది. ఇలా రెండు చేతులతో రాయగలిగే సామర్థ్యాన్ని "యాంబీడెక్స్టరిటీ" అని అంటారు. ఇలాంటి వారు చాలా అరుదు. కర్ణాటక మంగళూరుకు చెందిన 17ఏళ్ల బాలిక ఆది స్వరూప కూడా ఇదే కోవకు చెందుతుంది! తన అరుదైన సామర్థ్యంతో స్థానికుల నుంచి ప్రశంసలు పొందుతోంది.,రెండు చేతులతో అద్భుతం..!Aadi Swaroopa Mangalore : ఆది స్వరూప మెదడు రెండు భాగాలు ఒకేసారి పనిచేస్తాయి. అందుకే ఆమె రెండు చేతులతో రాయగలుగుతుంది. ఇలా లక్షల్లో ఒకరికి జరుగుతుంది. ఇక తన సామర్థ్యాలను పూర్తిగా తెలుసుకున్న స్వరూప.. 11 స్టైల్స్‌లో రాయడం అలవాటు చేసుకుంది. అంతేకాకుండా.. కళ్లకు గంతలు కప్పుకుని కూడా రెండు చేతులతో రాయగలదు. ఇక అక్షరాలను వెనుక వరుసలోను రాసుకుంటూ వస్తుంది ఈ బాలిక.,రెండు చేతులతో రాస్తున్న ఆది స్వరూపకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విడియోను రవి కర్కారా అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశాడు.,Aadi Swaroopa Ambidexterity : "ఈమె పేరు ఆది స్వరూప. మంగళూరులో ఉంటుంది. 11 స్టైల్స్‌లో, రెండు చేతులతో రాయగలదు. ఈమె మెదడులోని రెండు భాగాలు ఒకేసారి పనిచేస్తాయి. ఇది చాలా అరుదు," అని రవి ట్విట్టర్లో రాసుకొచ్చాడు.,నిమిషం వ్యవధిలో 45 పదాలను (ఇంగ్లీష్, కన్నడ) ఎటువైపైనా రాయగలిగే సామర్థ్యం ఉన్న ఆది స్వరూపకు గుర్తింపు లభించింది. లతా ఫౌండేషన్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్‌లో ఆమెకు చోటు దక్కింది. అంతేకాకుండా.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించుకుంది.,సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :,,ఆది స్వరూపపై ప్రశంసల వర్షం..Aadi Swaroopa writing with two hands : ఆది స్వరూపపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు చేతులతో ఆమె రాస్తుండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు మరింత గుర్తింపు లభించాలని ఆకాంక్షిస్తున్నారు.,