Hyderabad Tourist: హిమాచల్ ప్రదేశ్ పారా గ్లైడింగ్ ప్రమాదంలో హైదరాబాద్ మహిళ మృతి
Hyderabad Tourist: హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఆదివారం జరిగిన పారాగ్లైడింగ్ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ మృతి చెందింది.
Hyderabad Tourist: హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. పారాగ్లైడింగ్ ప్రమాదంలో హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల హైదనాబాద్ యువతి మృతి కేసులో పైలట్ ను పోలీసులు అరెస్టు చేశారు.
పారాగ్లైడింగ్ ఫెసిలిటీలోని పారా గ్లైడింగ్ పైలట్.. టూరిస్ట్ సేఫ్టీ బెల్ట్‌ను సరిగ్గా పెట్టకపోవడంతో ప్రమాదం జరిగింది. పారాగ్లైడింగ్ జరుగుతున్న సమయంలో ఎత్తు నుండి కింద పడి మరణించిందని పోలీసులు తమ నివేదికలలో పేర్కొన్నారు.
ప్రమాదానికి కారణమైన పైలట్‌కు రిజిస్టర్ చేయించామని, గ్లైడింగ్‌కు ఉపయోగించిన పరికరాలకు ఆమోదం లభించిందని, మహిళా పర్యాటకురాలి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించడమే ఈ దుర్ఘటనకు కారణమని టూరిజం అధికారి సునయన శర్మ పేర్కొన్నారు.
మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందని కులు పర్యాటక శాఖ అధికారి సునయన శర్మ తెలిపారు. ఆ ప్రాంతం పారా గ్లైడింగ్‌కు అనువైన స్థలమేనని ధృవీకరించారు. అందుకోసం వినియోగించిన పరికరాలు ఆమోదం పొందాయని, పైలట్ రిజిస్టర్ అయ్యారని, వాతావరణ సంబంధిత సమస్యలు లేవని ఆమె చెప్పారు.
మృతదేహానికి కులు ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటనపై కులు జిల్లా కలెక్టర్ తోరుల్ ఎస్ రవీష్ విచారణకు ఆదేశించారు. పాట్లికుహల్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 336, 334 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధ్యుడైన పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాదం జరిగిన కులులోని దోభి గ్రామంలో పారాగ్లైడింగ్ కార్యకలాపాలన్నీ నిలిపివేశారు.