Sugar adulteration: మీరు తింటున్నది పంచదార కాదు… ప్లాస్టిక్, యూరియా, కల్తీ చక్కెరను కనిపెట్టండిలా-adulterated sugar contains plastic and urea beware of fake sugar ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sugar Adulteration: మీరు తింటున్నది పంచదార కాదు… ప్లాస్టిక్, యూరియా, కల్తీ చక్కెరను కనిపెట్టండిలా

Sugar adulteration: మీరు తింటున్నది పంచదార కాదు… ప్లాస్టిక్, యూరియా, కల్తీ చక్కెరను కనిపెట్టండిలా

Haritha Chappa HT Telugu
Jul 02, 2024 09:47 AM IST

Sugar adulteration: మార్కెట్లో ఏదైనా స్వచ్ఛంగా దొరకడం కష్టంగా మారిపోయింది. పంచదారను కూడా కల్తీ చేసి అమ్మేస్తున్నారు. చక్కెరలో సున్నం, సర్ఫ్, విషపూరిత యూరియా వంటివి కలిపి విక్రయిస్తున్నారు.

కల్తీ పంచదారతో ప్రమాదం
కల్తీ పంచదారతో ప్రమాదం (Shutterstock)

నేటి రోజుల్లో స్వచ్ఛమైన ఆహారం దొరకడం కష్టంగా మారిపోయింది. అధిక లాభాలు పొందాలన్న ఆలోచనతో ఆరోగ్యానికి ఎంతో హాని కలిగించే రసాయనానలు కలిపి ప్రతి ఆహారాన్ని కల్తీ చేసి అమ్మేస్తున్నారు. స్వచ్ఛమైన వస్తువుకు, కల్తీ వస్తువుకు మధ్య తేడాను గుర్తించడం కష్టంగా మారిపోతుంది. అదేవిధంగా, ఈ రోజుల్లో కొంతమంది చక్కెరను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు.

పంచదారలో యూరియాను కలిపి అమ్మేస్తున్నారు. వీటితో పాటు చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను పొడి చేసి కలుపుతున్నారు. చాక్ పౌడర్, తెల్ల ఇసుక కలిపి కల్తీ చక్కెరను తయారు చేస్తున్నారు. ఈ విషపూరిత చక్కెరను తినడం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఇలా కల్తీ అయిన చక్కెరను ఎలా గుర్తించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

క్యాన్సర్ కారకం

ఇలాంటి కల్తీ చక్కెర తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా పంచదారను తినడం వల్ల విరేచనాలు, గుండె జబ్బులు, మధుమేహం, అలెర్జీల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్లాస్టిక్ చక్కెర తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా పంచదారలో కలిపిన యూరియా వల్ల కిడ్నీలకు చాలా హానికరం.

ఇలా కనిపెట్టండి

కల్తీ చక్కెరను గుర్తించడానికి ఎఫ్ఎస్ఎస్ఎఐ కొన్ని సులభమైన మార్గాలను ఇచ్చింది. దీని సహాయంతో మీరు స్వచ్ఛమైన పంచదరాను, కల్తీ చక్కెరను సులభంగా గుర్తించవచ్చు. చక్కెరలో సున్నం లేదా ప్లాస్టిక్ పొడి ఉందో లేదో తనిఖీ చేయడానికి చిన్న పరీక్ష చేయాలి. ఇందుకోసం ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఒక టీస్పూన్ పంచదార వేసి కరిగించాలి. పంచదార నీటిలో బాగా కరిగితే అది స్వచ్ఛంగా ఉంటుంది. అలా కాకుండా నీళ్లలో కొన్ని కణాలు కరగకుండా చిన్నగా కనిపిస్తూ ఉంటే అది కల్తీదని అర్థం. ప్లాస్టిక్ కణాలు కలిస్తే దాని కణాలు నీటి కింది భాగంలో గడ్డకట్టుకుపోవడం కనిపిస్తుంది.

చక్కెరలో యూరియాను కలిపి ఉంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ మరో సులభమైన మార్గాన్ని సూచించింది. ఇందుకోసం నీటిలో పంచదారను కలిపి కరిగించాలి. ఆ నీరు అమ్మోనియా వాసన వస్తే అది కల్తీ చక్కెర అని అర్థం. వాసన రాకపోతే పంచదార స్వచ్ఛమైనది అర్థం చేసుకోవాలి.

స్వచ్ఛమైన పంచదారను కూడా అతిగా తింటే సమస్యలు తప్పవు. శరీరానికి అవసరమైనదానికంటే అధికంగా పంచదారను తింటే అధిక నిద్ర వచ్చేస్తుంది. తీవ్ర అలసటగా అనిపిస్తుంది. కొందరిలో మొటిమల సమస్యలు ఎక్కువైపోతాయి. పొట్ట భాగంలో కొవ్వు పెరుగుతుంది. త్వరగా బరువు పెరిగే అవకాశం ఎక్కువ. చక్కెర అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల ఇతర ప్రాణాంకత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువే. కాబట్టి పంచదారను ఎంత తక్కువగా తింటే మంచిది.

టాపిక్