Hair auction: గుప్పెడు వెంట్రుకలను వేలం వేస్తే లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు, ఆ వెంట్రుకలు గొప్పతనం ఏంటో తెలుసుకోండి-a bunch of hairs are auctioned and bought for lakhs know what greatness those hairs are ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Auction: గుప్పెడు వెంట్రుకలను వేలం వేస్తే లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు, ఆ వెంట్రుకలు గొప్పతనం ఏంటో తెలుసుకోండి

Hair auction: గుప్పెడు వెంట్రుకలను వేలం వేస్తే లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు, ఆ వెంట్రుకలు గొప్పతనం ఏంటో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Aug 27, 2024 06:32 PM IST

Hair auction: మహనీయులు వాడిన పెన్నులు, కళ్లద్దాలు వంటివి వేలం వేస్తూ ఉంటారు. అలా ఫ్లోరెన్స్ నైటింగేల్ జుట్టును వేలం వేశారు. అదేదో సవరమంతా పొడవున్న జుట్టు కాదు, ఓ గుప్పెడు వెంట్రుకలు. వాటిని కూడా లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు.

వేలం వేసిన జుట్టు
వేలం వేసిన జుట్టు (Tennants)

Hair auction: విదేశాల్లో వేలం పాటలు జరుగుతూ ఉంటాయి. ఆ వేలం పాటల్లో మహనీయులు వాడిన వస్తువులను వేలం చేస్తూ ఉంటారు. ఆ వస్తువులు పెన్ను కావచ్చు, కళ్లద్దాలు కావచ్చు, వారు వేసుకున్న దుస్తులు కూడా కావచ్చు. అలా ఫ్లోరెన్స్ నైటింగేల్ జుట్టును వేలం వేశారు. ఫ్లోరెన్స్ నైటింగేల్‌ను ‘లేడీ విత్ ద లాంప్’ అని పిలుచుకుంటారు. ప్రపంచంలోనే ఆమె ఆధునిక నర్సుగా గుర్తుండిపోయింది.

ఆమెకు చెందిన గుప్పెడు వెంట్రుకలు ఆమె సోదరి బంధువుల ఇంట్లో ఉన్నాయి. వాటిని వారు వేలం చేసే వారికి అందించారు. నిజానికి ఈమె జుట్టును కొనుక్కునేందుకు ఎక్కువ ఖర్చు పెట్టరేమో అనుకున్నారు. కానీ ఒక వ్యక్తి 3,89,849 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. ఈ వేలంపాట నార్త్ యార్క్ షైర్లో జరిగింది.

ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి ప్రతి ఒక్కరూ చదువుకునే ఉంటారు. ఇప్పటి నర్సులకు ఆమె ఆరాధ్య దైవం. తొలిసారి ఆమె నేతృత్వంలోనే సైన్యానికి మహిళలు సేవలందించేందుకు కదిలారు. 1853లో జరిగిన క్రిమియా యుద్ధంలో గాయపడిన సైనికులకు ఆమె తన బృందంతో కలిసి విశేష సేవలు అందించారు. రష్యాతో.. బ్రిటన్, టర్కీ, సార్డీనియా, ఫ్రాన్స్ అంటే దేశాలు పోరాడాయి.

ప్రపంచంలో ఇలా యుద్ధరంగంలో సేవలు అందించిన మొట్టమొదటి నర్సుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ నిలిచిపోయింది. ఈమె బ్రిటిష్ జాతీయురాలు.

మార్లిన్ మన్రో గౌను

ఇలాంటి వేలం పాటలు చరిత్రలో ఎన్నో జరిగాయి. మార్లిన్ మన్రో వేసుకున్న ‘సబ్వే డ్రెస్సు’ను కూడా 2011లో వేలం వేశారు. ఆమె ఫోటో చూడగానే ఎక్కువగా కనిపించేది ఒక వైట్ డ్రెస్ పైకి ఎగురుతూ ఉంటుంది. అదే సబ్వే డ్రస్సు. దాన్నే వేలం వేస్తే ఏకంగా 5.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.

లండన్ లో మన దేశానికి చెందిన పాత పది రూపాయల నోటును కూడా వేలం వేశారు. ఆ పది రూపాయల నోటు 1918 నాటిది. 1918లో ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఓ పెద్ద ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు రెండు భారతీయ కరెన్సీ నోట్లు ఆ ఓడలోనే ఉన్నాయి. అందులో ఉన్న రెండు పది రూపాయలు నోట్లూ కూడా వరుస సంఖ్యలను కలిగి ఉన్నాయి. వాటిని అక్కడ ఉన్న ప్రవాస భారతీయులే కొనుక్కున్నారు.

టాపిక్