Yoga Tips for Immunity। యోగాతో ప్రారంభించండి.. మీ రోగనిరోధక ఆరోగ్యానికి ఈ అభ్యాసాలు సరైనవి!
Yoga tips for immunity: ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మన శరీరానికి ఇమ్యూనిటీ మెరుగుపరుచుకోవడం అవసరం. రక్త ప్రసరణను పెంచడానికి, మన శరీరాన్ని అన్నింటిని తట్టుకునేలా సిద్ధం చేయడానికి యోగా ఆసనాలు మీకు తోడ్పడతాయి.
Yoga tips for immunity: వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది, చల్లగా కురిసే వర్షాలు మానసిక స్థితిని, ఉత్సాహాన్ని పెంచుతాయి. అదే సమయంలో ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. తేమ వాతావరణం, వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి ద్వారా, గాలి ద్వారా లేదా దోమలు, ఈగలు, కీటకాలు మొదలైన వెక్టర్ల ద్వారా సంక్రమించే అనారోగ్యం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ సమయంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మన శరీరానికి ఇమ్యూనిటీ మెరుగుపరుచుకోవడం అవసరం. రక్త ప్రసరణను పెంచడానికి, మన శరీరాన్ని అన్నింటిని తట్టుకునేలా సిద్ధం చేయడానికి రోజువారీగా ఆరోగ్యకరమైన దినచర్యను అనుసరించడం చాలా ముఖ్యం. ఇందుకోసం శ్వాస వ్యాయామాలతో పాటు యోగా ఆసనాలు మీకు తోడ్పడతాయి.
ఓషో తపోబన్ ఇంటర్నేషనల్ కమ్యూన్ వ్యవస్థాపకుడు స్వామి ఆనంద్ అరుణ్ జీ HT డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శారీరకంగా, మానసికంగా బలంగా మారడానికి కొన్ని చిట్కాలు తెలియజేశారు, ఇవి మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తాయి.
1. యోగాతో మీ రోజును ప్రారంభించండి
యోగా చేయడానికి ఉదయం ఉత్తమ సమయం. మీ శరీరం, మనసును ఉత్తేజపరిచే ఈ రకమైన కార్యాచరణ మీ రోజును ప్రారంభించడానికి ఉత్తమ మార్గం. సూర్య నమస్కారం వంటి సున్నితమైన యోగా భంగిమలతో ఉదయం మీ దినచర్యను ప్రారంభించండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
2. శ్వాసకోశ ఆరోగ్యానికి శ్వాస వ్యాయామాలు
వర్షాకాలంలో ఇన్‌ఫ్లుఎంజా, జలుబు, ఆస్తమా, న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి అనేక సాధారణ శ్వాసకోశ వ్యాధులు ఇబ్బంది పెడతాయి. మీరు మీ శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచడానికి ప్రాణాయామం వంటి లోతైన శ్వాస వ్యాయామాలను అభ్యసించవచ్చు. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో, శ్వాసకోశ వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
3. మీ సామర్థ్యాన్ని బలోపేతం చేయండి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వర్షాకాలంలో మీ శరీరం, మనస్సును ఉన్నత స్థితిలో ఉంచుకోవచ్చు. ప్లాంక్, బోట్ పోజ్, బ్రిడ్జ్ పోజ్ వంటి యోగాసనాలు మీ శరీర సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఈ కార్యాచరణ శరీర స్థిరత్వానికి మద్దతు ఇస్తుంది , రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీర్ణ సమస్యలను నివారించడానికి పవనముక్తాసన వంటి యోగా భంగిమలను ప్రాక్టీస్ చేయండి.
4. మానసిక స్పష్టత కోసం ధ్యానం చేయండి
వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం, వాతావరణ మార్పుల చురుకుగా ఉండలేం. దీనివల్ల మానసిక కల్లోలం,ఆందోళన సమస్యలు పెరుగుతాయి కాబట్టి, మీ మానసిక ఆరోగ్యంను కాపాడటానికి రెగ్యులర్ మెడిటేషన్ సెషన్‌లు అవసరం అవుతాయి. ఇవి మీ ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడతాయి. రిలాక్స్డ్ మైండ్ మెరుగైన రోగనిరోధక పనితీరుకు, సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
5. హైడ్రేటెడ్ గా ఉండండి
మీ శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఒక మార్గం సరైన హైడ్రేషన్. శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి, శరీర పనితీరును నిర్వహించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. అల్లం లేదా తులసి టీ వంటి హెర్బల్ టీలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.
6. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినండి
మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. పసుపు, వెల్లుల్లి, సిట్రస్ పండ్లు వంటి ఆహారాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
7. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి
మీరు ప్రతి రాత్రి తగినంత నిద్ర పొందేలా చూసుకోండి. బాగా విశ్రాంతి పొందిన శరీరం అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పునరుద్ధరించుకుంటుంది. మీరు పగలు చురుకుగా ఉండగలుగుతారు. కాబట్టి రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి.
సంబంధిత కథనం
టాపిక్