Morning Drinks in Winter : చలికాలంలో పరగడుపున ఈ డ్రింక్స్ తాగితే చాలా మంచిదట..
Morning Drinks in Winter for Health : మీరు ఉదయం పూట మొదటగా తినే లేదా తాగేవి.. మీకు రోజంతా శక్తి స్థాయిలను అందించడంలో ప్రభావితం చేస్తాయి. అయితే పరగడుపున కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోయి.. మీరు మంచి ఆరోగ్యం పొందుతారు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Healthy Drinks in Winter : మీ కడుపు ఉదయాన్నే ఖాళీ కాకపోతే చాలా చిరాకుగా ఉంటుంది. అంతేకాకుండా మీ రోజంతా లేజీగా ఉంటుంది. అయితే మీ సిస్ట్మ్ శుభ్రపరిచే కొన్ని పానీయాలు ఇక్కడున్నాయి. వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం ఇవి డిటాక్స్ కోసం మాత్రమే కాకుండా.. మీకు చలికాలంలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. మీ శరీరాన్ని శుభ్రం చేసి.. డే కిక్ స్టార్ట్ చేసే పానీయాలు ఏంటో.. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరువెచ్చని నిమ్మ నీరు
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి సిప్ చేయండి. దీని వల్ల మీకు పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో, వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడడంలో చాలా సహాయం చేస్తుంది.
అంతే కాదు ఇది మీ శరీరం దాని pH స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. శరీరంలోని అన్ని టాక్సిన్‌లను సమర్థవంతంగా బయటకు పంపుతుంది.
నిమ్మకాయ, అల్లం, నల్ల మిరియాలు, పసుపు, దాల్చినచెక్క, తేనె
వివిధ ముఖ్యమైన మూలికలు, సుగంధ ద్రవ్యాలతో నిండి ఈ డ్రింక్ మీ జీర్ణాశయానికి చాలా మంచిది. నిమ్మరసం, అల్లం, పెప్పర్, పసుపు, దాల్చిన చెక్క, తేనె, నీళ్లతో ఈ డ్రింక్ తయారు చేసుకుని.. ఉదయాన్నే పరగడుపును తాగేయండి.
దీనివల్ల పొట్టలోని పుండ్లు, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత వ్యాధులు నుంచి ఉపశమనం పొందుతారు. వాస్తవానికి ఈ డ్రింక్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల అది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాలానుగుణ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.
తాజా గోధుమ గడ్డి రసం
ఉదయాన్నే తాజా గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవడం వల్ల అనేక శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మీరు బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా చర్మ వ్యాధులకు చికిత్స చేయడం నుంచి మీ ఆహార కోరికలను తగ్గించడం వరకు చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచి అలసటను తగ్గిస్తుంది.
దీనితో పాటు ఆర్థరైటిస్ చికిత్సలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మీ సిస్టమ్‌ను డిటాక్స్ చేయడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది.
తులసి డ్రాప్స్‌తో వెచ్చని నీరు
తులసి దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆయుర్వేద రంగానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మూలికలలో ఒకటి.
అయితే తులసి చుక్కలతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో లేదా ఉదయాన్నే ఒక కప్పు తులసి టీని త్రాగడం వల్ల మీ శక్తి స్థాయిలను సక్రియంగా ఉంటాయి. మీ జీర్ణవ్యవస్థను వృద్ధి చెందడంలో ఇది సహాయపడుతుంది.
అదనంగా ఇది చర్మ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు, అంతర్గత రక్షణ విధానాలను నియంత్రిస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.
థైమ్, పసుపు, అల్లం, మిరియాల డ్రింక్
మీరు జలుబు, శ్లేష్మ పెరుగుదలతో బాధపడుతుంటే.. థైమ్, పసుపు, అల్లం, మిరియాల డ్రింక్ తాగండి. ఇది మీ కోసం అద్భుతాలు చేయవచ్చు. ఎందుకంటే ఈ డ్రింక్ మీ నాసికా మార్గాన్ని క్లియర్ చేయడంలో సహాయం చేస్తుంది.
దీన్ని చేయడానికి.. ఒక టేబుల్ స్పూన్ థైమ్‌లో మిరియాలపొడి, తురిమిన అల్లం, పసుపు పొడిని నీటిలో వేసి 10 నిమిషాలు ఉడకబెట్టండి. వడకట్టి తాగేయండి. ఇది వింటర్లో మీకు మంచి డ్రింక్ అవుతుంది.
సంబంధిత కథనం