5 diabetic drinks: డయాబెటిస్ తగ్గించే 5 పానీయాలు.. ఉదయాన్నే తీసుకుంటే మేలు..
5 diabetic drinks: చక్కెర స్థాయుల్ని నియంత్రించడంతో పాటూ రోజూ మొత్తం హుషారుగా ఉండేలా చేస్తాయీ పానీయాలు. అవేంటో చూడండి.
చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తప్పనిసరి. ముఖ్యంగా ఉదయాన్నే మంచి ఆహారంతో మొదలెడితే రోజంతా దాని ప్రభావం ఉంటుంది. మొక్కల నుంచి వచ్చే ఆహారం, విత్తనాలు, హర్బ్స్ తీసుకోవడం వల్ల చాలా మార్పులుంటాయి.
డయాబెటిస్ తగ్గించే 5 పానీయాలు:
1. మెంతుల నీళ్లు:
మెంతి లేదా మెంతి గింజలు సహజంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచే లక్షణాలు కలిగి ఉన్నాయి. వీటిలో ఉండే నీటిలో కరిగే ఫైబర్, సపోనిన్స్ జీర్ణప్రక్రియను ఆలస్యం చేస్తాయి, కార్బోహైడ్రేట్ల శోషణ తగ్గించి రక్తంలో గ్లుకోజ్ స్థాయులు తగ్గిస్తాయి. మెంతి గింజలు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడానికి కూడా ఒక సూపర్ ఫుడ్.
ఒక చెంచాల మెంతులను రాత్రిపూట గ్లాసు నీళ్లలో నానబెట్టి, వడగట్టి ఉదయాన్నే తాగాలి.
2. ఉసిరి -కలబంద:
ఉసిరి, కలబంద కలిపి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయులు పెరిగి రక్తంలో చక్కెర స్థాయులు తగ్గిస్తాయి. ఉసిరిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలుంటాయి. కలబంద గుజ్జు తీసుకోవడం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ లో మార్పు కనిపిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాదు ఇది బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది.
ఉసిరి, కలబంద రసంలో తేనె,నిమ్మరసం, మిరియాలపొడి కలుపుకొని తాగాలి.
3. చియా గింజల నీళ్లు:
వీటిలో పీచు, ప్రొటీన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ కాకుండా కాపాడుతుంది.
ఒక చెంచా చియాగింజల్ని నీళ్లలో నానబెట్టి గింజలతో సహా నీల్లు తాగొచ్చు. లేదా రుచి కోసం దాంట్లో నిమ్మకాయ ముక్కలు కొన్ని వేయండి. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి, చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
4. తులసి టీ:
తులసిలో హైపో గ్లైసెమిక్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది మధుమేహ సమస్యల్ని తగ్గిస్తుంది. తులసి ఇన్సులిన్ సెన్సిటివిటీ , గ్లుకోజ్ మెటబాలిజం పెంచుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
కప్పు నీళ్లలో 7 నుంచి 8 తులసి ఆకులు వేసి మరిగించాలి. అవే నీళ్లలో కాస్త కచ్చా పచ్చాగా చేసుకున్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. కాస్త చల్లారాక నిమ్మరసం పిండుకుని తాగాలి.
5. ధనియాల నీళ్లు:
ధనియాల్లో ఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఇవి వాపు లక్షణాలను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి. ఇన్సులిన్ స్థాయుల్ని పెంచి చక్కెర స్థాయుల్ని తగ్గిస్తాయి.
పదిగ్రాముల ధనియాలను రెండు లీటర్ల నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వడగట్టి నీళ్లని తాగాలి.
టాపిక్